News August 1, 2024

ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి: కలెక్టర్

image

ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల జిల్లా కాంప్లెక్స్ హైస్కూల్ హెచ్ఎంలతో కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్కూల్లో జరుగుతున్న విషయాలపై ఆరా తీశారు. వెనుకబడిన పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. పిల్లలకు ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్ సబ్జెక్టులలో చదవడం, రాయడంపై ప్రత్యేక తరగతులు తీసుకోవాలన్నారు. అన్ని పాఠశాలలో బేసిక్ టెస్టులు నిర్వహించాలన్నారు.

Similar News

News March 13, 2026

KNR: అల్లరి మూకల అదుపుపై పోలీసులకు శిక్షణ

image

శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఏఆర్, క్యూఆర్‌టీ బలగాలకు ‘మాబ్ ఆపరేషన్ డ్రిల్’ నిర్వహించారు. కరీంనగర్ సీపీ గౌస్ ఆలం పర్యవేక్షణలో సిబ్బందికి లాఠీఛార్జ్, స్మోక్ గన్, ‘వజ్ర’ వాహన వినియోగంపై ప్రత్యక్ష శిక్షణ ఇచ్చారు. అల్లరి మూకలను వ్యూహాత్మకంగా అదుపు చేస్తూనే, స్వీయ రక్షణ పాటించాలని సీపీ సూచించారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

News March 13, 2026

కరీంనగర్ పీటీసీలో ఘనంగా దీక్షాంత పరేడ్

image

కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (పీటీసీ)లో 99 మంది నూతన కానిస్టేబుళ్ల దీక్షాంత పరేడ్ ఘనంగా జరిగింది. తొమ్మిది నెలల శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థుల నుంచి సీపీ గౌష్ ఆలం గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణలో ప్రతిభ చాటిన వారికి అవార్డులు అందజేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని, ప్రజలకు జవాబుదారీగా ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని ఈ సందర్భంగా సీపీ పిలుపునిచ్చారు.

News March 13, 2026

KNR: ‘కొత్త కలెక్టరేట్‌ను సుందరంగా తీర్చిదిద్దాలి’

image

కరీంనగర్ జిల్లా కొత్త కలెక్టరేట్‌ పనులను సత్వరమే పూర్తి చేసి, భవనాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం నిర్మాణ పనులను పరిశీలించిన ఆమె.. ప్రధాన గేటు, విద్యుత్‌, పైపులైను వంటి పెండింగ్‌ పనులపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలన్నారు. ప్రారంభానికి సిద్ధం చేసేలా పనుల్లో వేగం పెంచాలని స్పష్టం చేశారు.