News August 1, 2024
OLYMPICS: సాత్విక్-చిరాగ్ జోడీ ఓటమి
బ్యాడ్మింటన్ మెన్స్ డబుల్స్ కేటగిరీలో భారత్కు నిరాశే మిగిలింది. సాత్విక్-చిరాగ్ జోడీ మలేషియా చేతిలో ఓటమి పాలైంది. తొలి సెట్లో 21-13 తేడాతో సునాయాసంగా గెలుపొందిన ఈ జోడీ ఆ తర్వాత తడబడింది. రెండో సెట్లో 14-21 తేడాతో ఓడిపోయింది. హోరాహోరీగా సాగిన మూడో రౌండ్లో సాత్విక్-చిరాగ్ జోడీ పుంజుకున్నా ఆ తర్వాత పట్టుకోల్పోయింది. దీంతో 16-21 తేడాతో మూడో రౌండ్లో ఓడి సెమీస్ ఆశలు చేజార్చుకుంది. <<-se>>#Olympics2024<<>>
Similar News
News February 2, 2025
కంటి చూపును తిరిగి రప్పించే ఔషధం!
కంటి నరాల చుట్టూ ఉండే మైలిన్ అనే రక్షణ కవచం దెబ్బతిన్నప్పుడు కంటిచూపు మందగిస్తుంది. అలా కోల్పోయే వారి చూపును మెరుగుపరిచే సామర్థ్యమున్న ఔషధాన్ని అమెరికాలోని కొలరాడో పరిశోధకులు అభివృద్ధి చేశారు. LL341070గా పిలుస్తున్న ఈ ఔషధం మైలిన్ మరమ్మతు విషయంలో శరీరానికి సాయంగా నిలుస్తుందని వారు వివరించారు. అయితే ప్రస్తుతం పరిశోధన స్థాయిలో ఉన్నామని, త్వరలోనే పూర్తిస్థాయి ఔషధాన్ని తీసుకొస్తామని వారు చెప్పారు.
News February 2, 2025
అలా జరగకపోతే పేరు మార్చుకుంటా: డైరెక్టర్
‘తండేల్’ డైరెక్టర్ చందూ మొండేటి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాను లవర్స్ రిపీటెడ్గా చూడకపోతే తన పేరు మార్చుకుంటానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కాగా నాగచైతన్య, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ వాస్తవిక ఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఈ నెల 7న థియేటర్లలో రిలీజ్ కానుంది.
News February 2, 2025
కంగ్రాట్స్ టీమ్ ఇండియా: సీఎం చంద్రబాబు
U-19 T20 ప్రపంచకప్ గెలుచుకున్న భారత అమ్మాయిల్ని AP CM చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, YSRCP అధినేత YS జగన్ అభినందించారు. ‘మీ కష్టం, సంకల్పంతో సౌతాఫ్రికాపై ఘనవిజయం సాధించి భారతీయుల్ని గర్వించేలా చేశారు’ అని చంద్రబాబు, ‘దేశ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపచేశారు. తెలుగువారికి త్రిష గర్వకారణం’ అని లోకేశ్ కొనియాడారు. జట్టు భవిష్యత్తులో మరిన్ని అద్భుత విజయాలు సాధించాలని మాజీ CM జగన్ ఆకాంక్షించారు.