News August 1, 2024

రాహుల్ vs పంత్.. రోహిత్ శర్మ ఏమన్నారంటే?

image

శ్రీలంకతో రేపటి నుంచి జరిగే ODI సిరీస్‌లో WKగా ఎవరిని ఆడించాలనేది ఇంకా నిర్ణయించలేదని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. ‘కేఎల్ రాహుల్, పంత్ ఇద్దరూ క్వాలిటీ ప్లేయర్స్, మ్యాచ్ విన్నర్స్. టీమ్‌లో క్వాలిటీ ఉంది కాబట్టే సెలక్షన్ గురించి బయట చర్చ జరుగుతోంది. జట్టులో ఇలాంటి మంచి ప్లేయర్లు ఉన్నప్పుడు తుది జట్టు ఎంపిక కష్టంగా మారుతుంది. కానీ ఇలాంటి సమస్యలు ఉండటం మంచిదే’ అని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అన్నారు.

Similar News

News December 28, 2025

బంగ్లాదేశ్‌లో దాడులను అందరూ వ్యతిరేకించాలి: అమెరికా

image

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను అమెరికా ఖండించింది. ఒక వర్గానికి వ్యతిరేకంగా కామెంట్లు చేశారనే ఆరోపణలతో దీపూ చంద్రదాస్ అనే యువకుడిని ఓ ముఠా హత్య చేసిన ఘటనపై అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి దారుణమైన ఘటనలను అందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్‌లోని అన్ని వర్గాల భద్రత కోసం యూనస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను స్వాగతిస్తున్నానని చెప్పారు.

News December 28, 2025

DRDO-DGREలో JRF పోస్టులు

image

<>DRDO <<>>ఆధ్వర్యంలోని డిఫెన్స్ జియో ఇన్ఫర్మేటిక్స్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్(DGRE) 15 JRF, రీసెర్చ్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల వారు డిసెంబర్ 29, 30 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరు కావొచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ME, ఎంటెక్, BE, బీటెక్, NET, GATE, MSc, PhD ఉత్తీర్ణులు అర్హులు. JRFకు నెలకు రూ.37000, రీసెర్చ్ అసోసియేట్‌కు రూ.67వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.drdo.gov.in

News December 28, 2025

న్యూ ఇయర్ పార్టీ చేసుకునే వారికి హెచ్చరిక

image

TG: న్యూ ఇయర్ పార్టీల్లో మద్యం వినియోగానికి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని, లేదంటే కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్‌ కమిషనర్‌ హరికిరణ్‌ హెచ్చరించారు. జనవరి 1 వరకు నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌‌(NDPL)తో పాటు డ్రగ్స్‌ అమ్మకాలు, వినియోగాలపై తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. NDP లిక్కర్‌ను రాష్ట్రంలోకి రాకుండా అన్ని మార్గాల్లో నిఘా పెట్టి నిలువరించాలని అధికారులను ఆదేశించారు.