News August 1, 2024
GOOD NEWS: రేపే జాబ్ క్యాలెండర్

TG: జాబ్ క్యాలెండర్‌ను రేపు అసెంబ్లీలో ప్రకటిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. క్యాబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గౌరవెల్లి ప్రాజెక్టు పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు రూ.437 కోట్లను కేటాయించినట్లు పేర్కొన్నారు. GHMCలో ఔటర్ గ్రామాల విలీనానికి శ్రీధర్‌బాబు అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
Similar News
News April 11, 2026
చర్మంపై నల్లటి మచ్చలా.. ఇలా చేయండి!

సూర్యరశ్మి, కాలుష్యం, హార్మోన్ల మార్పుల వల్ల చర్మంపై నల్లటి మచ్చలు (పిగ్మెంటేషన్) ఏర్పడతాయని డెర్మటాలజిస్టులు చెబుతున్నారు. సన్‌స్క్రీన్ వాడకం, చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఈ సమస్యను అరికట్టవచ్చని సూచిస్తున్నారు. కాలుష్యం వల్ల కలిగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ చర్మాన్ని దెబ్బతీస్తుందని, సరైన పోషణతో దీనిని నివారించవచ్చని పేర్కొంటున్నారు. హెల్తీ లైఫ్‌స్టైల్ చర్మ సౌందర్యానికి కీలకమంటున్నారు.
News April 11, 2026
25,487 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. పరీక్షల తేదీలు ప్రకటన

సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో కానిస్టేబుల్ (GD) ఉద్యోగాల పరీక్షల తేదీలను స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) విడుదల చేసింది. ఏప్రిల్ 27 నుంచి మే చివరి వరకు దేశంలోని వివిధ సెంటర్లలో <
Share It
News April 11, 2026
రేపటి వరకు వర్షాలు!

ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ను ఆనుకొని ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణశాఖ తెలిపింది. ఉత్తర తమిళనాడు ప్రాంతంలో సముద్ర మట్టానికి 0.9కి.మీ. ఎత్తులో కొనసాగుతోందని పేర్కొంది. దీని ప్రభావంతో రేపు ఉదయం వరకు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. అటు మిగతా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే ఆస్కారముందని వివరించింది.


