News August 1, 2024
నెల్లూరు: ఫైనల్ సెమిస్టర్ లా ఫలితాలు విడుదల

నెల్లూరు జిల్లా విక్రమ సింహపురి యూనివర్సిటీ లా ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. 3 ఏళ్ల 6వ సెమిస్టరు ఫలితాలు వెలువడినట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీధర్ తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థులు నిరాశ చెందకుండా రీ వాల్యుయేషన్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 3 సంవత్సరాల కోర్సు విద్యార్థుల 5వ సెమిస్టర్ రీ వాల్యుయేషన్ ఫలితాలు రావాలని, అవి కూడా విడుదల చేస్తారని పేర్కొన్నారు.
Similar News
News March 22, 2026
నెల్లూరులో దారుణ హత్య.. మృతుడి వివరాలు ఇవే!

నెల్లూరు బోడిగాడి తోటలోని శ్మశాన వాటికలో గుర్తు తెలియని వ్యక్తి<<19446783>> దారుణ హత్యకు<<>> గురైన విషయం తెలిసిందే. నవాబ్‌పేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతుని వివరాలపై ఆరా తీశారు. మృతుడు మహారాష్ట్రకు చెందిన వీర్ క్రాంత్ అని, వలస కూలీ అని చెబుతున్నారు. మృతదేహం పక్కనే ఉన్న సిమ్ కార్డ్ ఆధారంగా వివరాలు తెలిసినట్టు సమాచారం.
News March 22, 2026
నెల్లూరు నగరంలో దారుణ హత్య!

నెల్లూరు నగరంలో బోడిగోడి తోటలో దారుణ హత్య జరిగినట్లు సమాచారం. వ్యక్తిగత విభేదాల నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తిని ఈ హత్య చేసి కాల్చేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసుల విచారణలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 22, 2026
నెల్లూరు జిల్లాలో విషాదం

నెల్లూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. చేజర్ల మండలం చిత్తలూరు గ్రామానికి చెందిన పరుచూరి కృష్ణయ్య (60) శనివారం చిర్లవారికండ్రిక సమీపంలో చెట్లెక్కి కల్లు తీశాడు. అనంతరం అలసిపోయి చెట్ల కింద సేదతీరుదామని దగ్గరలోని తాటి పీచు తెచ్చుకున్నాడు. చెట్టు కింద కూర్చున్న సమయంలో తాటిపీచులో ఉన్న రక్తపింజరి పాము కాటు వేసింది. పొదలకూరు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కృష్ణయ్య మృతి చెందాడు.


