News August 1, 2024
కడప: పోలీస్ సిబ్బంది సంక్షేమంపై ప్రత్యేక దృష్టి

కడప జిల్లాలో పనిచేస్తున్న పోలీసులు, సిబ్బంది సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తానని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. పోలీసు సిబ్బంది సంక్షేమంలో భాగంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న విభాగాలను ఎస్పీ హర్షవర్ధన్ రాజు పరిశీలించారు. కల్పతరు పోలీస్ వెల్ఫేర్ స్టోర్స్ సందర్శించి, అందులో లభించే కిరాణా ఎలక్ట్రికల్ వస్తువులు గురించి ఆరా తీశారు. నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.
Similar News
News February 28, 2026
’60 ఏళ్ల స్నేహం’ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి కంటతడి

రాజుపాలెం (M)లోని కొర్రపాడు గ్రామానికి చెందిన మండల పరిషత్ మాజీ కో ఆప్షన్ సభ్యుడు కమాలుద్దీన్ అనారోగ్యంతో మృతి చెందారు. మరణవార్త తెలుసుకున్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి కొర్రపాడు గ్రామానికి చేరుకుని కమాలుద్దీన్ మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. కమాలుద్దీన్‌తో 60 ఏళ్లుగా కొనసాగుతున్న స్నేహాన్ని గుర్తుచేసుకుంటూ “మంచి మిత్రుడిని కోల్పోయాను” అని కంటతడి పెట్టారు.
News February 28, 2026
సిద్ధవటంలో చిరుత సంచారం

సిద్ధవటం మండలంలో చిరుత పులి సంచారం స్థానికంగా భయాందోళనలు రేకెత్తిస్తోంది. కనుమలోపల్లి అటవీ బీట్ పరిధిలోని పంట పొలాల సమీపంలో చిరుత పాదముద్రలను గుర్తించినట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి ప్రసాద్ శుక్రవారం ధృవీకరించారు. మూలపల్లి, కనుమలోపల్లి గ్రామాల్లో చిరుత తిరుగుతోందని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి గుర్తిస్తామని తెలిపారు.
News February 28, 2026
కడప: ఇద్దరు MEOలు సస్పెండ్

ముద్దనూరు MEO-1 అన్నయ్య, కొండాపురం MEO-1 ఓబులేశును సస్పెన్షన్ చేస్తూ ఉన్నతాధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముద్దనూరు మండలం చింతకుంట ఎంపీపీ స్కూల్‌లో గతంలో విధులు నిర్వర్తించిన ఓ ఉపాధ్యాయుడు పాఠశాలకు గైర్హాజరైనా కూడా MEOలు జీతాలు మంజూరు చేసినట్లు విచారణలో వెల్లడైంది. దీంతో MEOలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.


