News August 1, 2024
ట్రంప్ గెలిస్తే యూఎస్‌తో దోస్తీకి కిమ్ గ్రీన్ సిగ్నల్?

డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైతే అమెరికాతో చర్చలకు కిమ్ సర్కార్ సానుకూలంగా ఉందని ఉత్తరకొరియా మాజీ దౌత్యవేత్త రీ ఇల్ గ్యూ పేర్కొన్నారు. USతో చర్చలు జరిపి అణు ప్రయోగాలపై ఆంక్షలను తొలగించుకోవాలని ఉ.కొరియా ప్లాన్ చేస్తోందట. ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోందనే ముద్రను చెరిపించుకుని నిధులకు లైన్ క్లియర్ చేసుకోవాలని భావిస్తోందట. క్యూబాలో విధులు నిర్వహించే రీ గత ఏడాది కుటుంబంతో సౌత్ కొరియాకు పరారయ్యారు.
Similar News
News March 12, 2025
సాగునీటి నిర్వహణలో ప్రభుత్వం విఫలం: KCR

TG: కాంగ్రెస్ ప్రభుత్వానికి సరిపడా సమయం ఇచ్చామని, మూడో వంతు సమయం పూర్తైందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. సాగునీటి నిర్వహణ విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. నీరు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. దళితబంధు నిలిపివేయడం, గొర్రెల పెంపకం, చేపల పంపిణీపై ప్రభుత్వాన్ని నిలదీయాలని పార్టీ ప్రజాప్రతినిధులకు స్పష్టం చేశారు.
News March 12, 2025
మహేశ్ బాబు-రాజమౌళి సినిమా కథ ఇదేనా?

మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో రానున్న సినిమా గురించి బాలీవుడ్ పోర్టల్ పింక్ విల్లా ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం.. ఈ మూవీ కథ కాశీ చరిత్రకు సంబంధించిందిగా ఉండనుంది. పురాణాలకు, నేటి కాలానికి ముడిపెడుతూ సినిమా సాగుతుంది. దీని కోసమే మూవీ టీమ్ హైదరాబాద్‌లో కాశీ సెట్ వేశారు. రామాయణంలో హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చే ఘట్టం ఈ కథకు ప్రధాన స్ఫూర్తి అని తెలుస్తోంది.
News March 11, 2025
ఈ ప్రాంతాల్లో సూర్యుడు అస్తమించడు!

రాత్రి కాగానే చీకటవ్వడం సర్వసాధారణం. కానీ సూర్యుడు అస్తమించకుండా, అర్ధరాత్రి వేళల్లోనూ ప్రకాశించే ప్రాంతాల గురించి విన్నారా? నార్వేలోని ట్రామ్సో, స్వాల్బార్డ్, ఐస్లాండ్లోని రెయ్క్‌జావిక్, కెనడాలోని యుకోన్, ఫిన్లాండ్, రష్యాలోని సెయింట్ పీటర్స్‌బెర్గ్‌లో సూర్యుడు కనిపిస్తూనే ఉంటాడు. ఆ ప్రాంతాల ప్రజలు కిటికీలకు తెరలు వేసో, కళ్లకు మాస్కులు ధరించో నిద్రపోతుంటారు. కొంతమంది మాత్రం ఎంజాయ్ చేస్తుంటారు.