News August 1, 2024
శ్రీకాకుళం జిల్లాలో 97.49శాతం పింఛన్ల పంపిణీ

జిల్లాలో గురువారం ఉదయం నుంచి సామాజిక పింఛన్ల పంపిణీ ప్రక్రియ కొనసాగిన విషయం తెలిసిందే. వివిధ కేటగిరీల్లోని లబ్ధిదారులకు పెన్షన్ డబ్బులు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా రాత్రి 9.30గంటల వరకు 97.49శాతం మందికి పింఛన్లు అందించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 3,18,017 మందికి గానూ 3,10,046మందికి పెన్షన్ అందినట్లు పేర్కొంది.
Similar News
News March 22, 2026
శ్రీకాకుళం: కమర్షియల్ గ్యాస్ కొరత… మూతపడుతున్న హోటల్స్

శ్రీకాకుళం నగరం, ఆమదాలవలస, పలాస కాశిబుగ్గ, ఇచ్చాపురం వంటి పట్టణాలు, నరసన్నపేట, పొందూరు వంటి ప్రాంతాల్లో కమర్షియల్ గ్యాస్ కొరత సమస్యగా మారింది. దీంతో హోటల్లో మూతపడుతున్నాయి. జిల్లాలో 400 వరకు హోటల్స్ ఉన్నాయి. హోటళ్ల సంక్షోభం అల్పాహారం, భోజనం కోసం ఆధారపడే వారితోపాటు, హోటల్లో పనిచేస్తున్న వారిపై సైతం ప్రభావం చూపుతుంది. డొమెస్టిక్ గ్యాస్ సరఫరాపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు.
News March 22, 2026
మూలపేట పోర్ట్ సకాలంలో పూర్తయ్యేనా ?

టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాలి మండలం మూలపేట పోర్ట్ పనులు జాప్యంపై వైసీపీ పార్టీ సందర్శనకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ పోర్ట్ ఎప్పటికీ పూర్తయ్యేను? అన్న చర్చ సాగుతుంది. 2023 ఏప్రిల్ 19న రూ.2,949.70 కోట్ల అంచనాతో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పనులు ప్రారంభించారు. 2025 అక్టోబర్ 17న డెడ్ లైన్ నిర్ణయించారు. మళ్లీ 2026 నవంబరుకి పెంచారు. గడువులోగా పూర్తయ్యేనా అన్నది ప్రధాన చర్చ…!
News March 22, 2026
హిరమండలం: యువతిని ప్రేమించాడు.. కులం పేరుతో దూషించాడు.. జైలు

హిరమండలం మండలం నిమ్మలపాడు గ్రామానికి చెందిన గిరిజన యువతిని కులం పేరుతో దూషించినందుకు పోలాకి మండలానికి చెందిన దుర్గారావుకు శ్రీకాకుళం కోర్టు రిమాండ్ విధించినట్లు ఎస్సై హేమంత్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. గిరిజన యువతిని ప్రేమ పేరుతో దుర్గారావు మోసం చేశాడు. పెళ్లి చేసుకోమని మహిళ అడగగా కులం పేరుతో దూషించాడని ఎస్ఐ చెప్పారు. దీనిపై అట్రాసిటీ కేసు నమోదు చేశామన్నారు.


