News August 1, 2024

హోంమంత్రి లేకపోవడం వల్ల నేరాలు పెరుగుతున్నాయి: కేటీఆర్

image

TG: రాష్ట్రంలో 48 గంటల్లోనే నాలుగు అత్యాచారాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోందని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని ట్వీట్ చేశారు. 8 నెలలుగా హోంమంత్రి లేకపోవడం దారుణమని, అందువల్లే నేరాలు పెరుగుతున్నాయన్నారు. వనస్థలిపురం, శాలిగౌరారం, నిర్మల్, పుప్పాలగూడలో జరిగిన ఘటనలపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Similar News

News March 22, 2026

SRH బౌలింగ్ వెరీ వీక్: అభినవ్

image

SRH బ్యాటింగ్ లైనప్ భీకరంగా ఉన్నప్పటికీ బౌలింగ్ వీక్‌ అని మాజీ క్రికెటర్ అభినవ్ ముకుంద్ అభిప్రాయపడ్డారు. ‘బ్యాటింగ్‌కు 10/10 రేటింగ్ ఉంటే బౌలింగ్‌కు 1/10 మాత్రమే. జయ్‌దేవ్, హర్షల్‌పైనే పేస్ భారం ఉంది. మిగతా వాళ్లకు అనుభవం లేదు. టాలెంటెడ్ పేసర్లు ప్రఫుల్, ఓంకార్, షకీబ్ ఉన్నప్పటికీ ఒక్క మ్యాచూ ఆడలేదు. వేలంలో స్పెషలిస్టు బౌలర్లను కాకుండా లివింగ్‌స్టోన్‌ను కొనడం ఆశ్చర్యం కలిగించింది’ అని పేర్కొన్నారు.

News March 22, 2026

‘ఉస్తాద్ భగత్ సింగ్’.. మూడో రోజు కలెక్షన్లు ఇవే

image

హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ 3 రోజుల్లో రూ.63.08 కోట్లు(గ్రాస్) వసూలు చేసినట్లు Sacnilk వెల్లడించింది. మొత్తంగా రూ.53.90 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయంది. మూడో రోజు శనివారం 36 శాతం ఆక్యుపెన్సీతో రూ.9.15 కోట్లు(నెట్) వసూలైనట్లు పేర్కొంది. ఇవాళ ఆదివారం కావడంతో కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. బాక్సాఫీస్ వసూళ్లపై మేకర్స్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు.

News March 22, 2026

చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ

image

దేశ రాజకీయాల్లో ప్రధాని మోదీ సరికొత్త రికార్డును సృష్టించారని కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. దేశ చరిత్రలోనే అత్యధిక రోజులు(8,931) ప్రభుత్వాధినేతగా(గుజరాత్ CM+ దేశ PM) పని చేసిన వ్యక్తిగా నిలిచారని ట్వీట్ చేశారు. ఈ క్రమంలో సిక్కిం మాజీ CM పవన్ చామ్లింగ్(8,930) రికార్డును బ్రేక్ చేశారన్నారు. మోదీ గుజరాత్ CMగా 12 ఏళ్ల 227 రోజులు పనిచేశారు. PMగా నేటితో 11 ఏళ్ల 299 రోజులు పూర్తి చేసుకున్నారు.