News August 1, 2024

KTR అరెస్టుపై MP అరవింద్ సెటైర్లు

image

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టుపై సెటైర్లు వేశారు. అసెంబ్లీ నుంచి కేటీఆర్ ను మార్షల్స్ బయటకు ఎత్తుకెళ్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అయితే ఆ వీడియోని ఎంపీ అరవింద్ ఫేస్ బుక్, ఎక్స్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘అప్పుడు.. కన్ను మిన్ను కనపడలే.. ఇప్పుడు.. ఖాకీలు కూడా దేకట్లే’ అని కేటీఆర్ పై అర్వింద్ సెటైర్లు వేశారు.

Similar News

News September 16, 2025

నిజామాబాద్: ఈ నెల 17 నుంచి పోషణ మాసం

image

పిల్లల పెరుగుదలకు, పోషణ లోపం తగ్గించుట, బరువు లోపం లేకుండా పోషక ఆహారాలను అందించుటలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం కలెక్టర్ సమావేశం నిర్వహించారు. పోషణ మాసం కార్యక్రమాల అమలు తీరును సమీక్షించి, అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు.

News September 16, 2025

నిజామాబాద్: విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకోవాలి: సీపీ

image

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సోమవారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరిగిన ఇంజినీర్స్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు. నేటితరం ఇంజినీర్లు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ముందుగా విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఇంజినీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

News September 16, 2025

నిజామాబాద్: ఓటర్ల జాబితా సవరణకు సిద్ధంగా ఉండాలి

image

నియోజకవర్గాల పరిధిలో ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-2026’ ప్రక్రియను చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.సుదర్శన్ రెడ్డి సూచించారు. సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ప్రక్రియపై సన్నాహక సమావేశం నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు అందిన వెంటనే ఓటర్ల జాబితా సవరణను ప్రారంభించాలని, అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.