News August 1, 2024
షాక్.. ఛార్జింగ్ కేబుల్ నోట్లో పెట్టుకొని బాలిక మృతి
TG: సెల్‌ఫోన్ <<13718301>>ఛార్జింగ్‌కు<<>> మరో చిన్నారి బలైంది. ఆదిలాబాద్ జిల్లా కొత్తమద్ది పడగకు చెందిన ఏడాదిన్నర బాలిక ఆరాధ్య ఇంట్లోని ఛార్జింగ్ కేబుల్ నోట్లో పెట్టుకోవడంతో విద్యుత్ షాక్‌కు గురైంది. తల్లిదండ్రులు ఆమెను ఖానాపూర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు ఛార్జింగ్ కేబుళ్లు పిల్లలకు అందకుండా పెట్టాలి. ఛార్జింగ్ పూర్తికాగానే తొలగించాలి.
Similar News
News February 3, 2025
అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు నిరాశ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. ‘తండేల్’ ఈవెంట్‌కు ఆయన ముఖ్య అతిథిగా వస్తారని భావించినా కొన్ని కారణాలతో రాలేకపోయారు. దీంతో చాలా కాలం తర్వాత AA స్పీచ్ విందామనుకున్న అభిమానులకు మరోసారి ఎదురుచూపులు తప్పలేదు. అల్లు అర్జున్ వస్తారనే ఈ ఈవెంట్‌కి ఫ్యాన్స్‌కు ఎంట్రీ నిషేధించారని సినీ వర్గాలు పేర్కొన్న సంగతి తెలిసిందే.
News February 3, 2025
టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్లు
* అభిషేక్ శర్మ-135(ఇంగ్లండ్‌పై)
* శుభ్‌మన్ గిల్- 126*(న్యూజిలాండ్‌పై)
* రుతురాజ్ గైక్వాడ్- 123*(ఆస్ట్రేలియాపై)
* విరాట్ కోహ్లీ- 122*(అఫ్గానిస్థాన్‌పై)
* రోహిత్ శర్మ- 121*(అఫ్గానిస్థాన్‌పై)
News February 2, 2025
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
AP: తిరుపతి జిల్లా పుత్తూరు-నగరి మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామాపురం వద్ద వేగంగా దూసుకు వచ్చిన లారీ ఓ ప్రైవేట్ బస్సును ఢీకొట్టిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటనలో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. లారీ తిరుత్తణి వైపు వెళ్లినట్లు స్థానికులు చెప్పారు. మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.