News August 1, 2024

శ్రీశైలం జెన్‌కో అధికారులతో మంత్రి గొట్టిపాటి సమావేశం

image

అద్దంకి ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, గురువారం శ్రీశైలం జన్ కో ప్లాంట్ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జలాశయంలో నీటి సామర్థ్యం, విద్యుత్ ఉత్పత్తి తదితర అంశాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అంతరాయం లేని విద్యుత్‌ను రాష్ట్ర ప్రజలకు అందించడానికి చర్యలను తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News March 12, 2026

మార్కాపురంలో కొత్తగా రూర్బన్ పంచాయతీలు

image

పంచాయతీ జనాభా వార్షిక ఆదాయం, భౌగోళిక స్వరూపం ఆధారంగా ప్రభుత్వం విభజన చేపట్టింది. ఇప్పటివరకు ఐదు గ్రేడులుగా ఉండగా వాటిని నాలుగు గ్రేడులుగా కుదించింది. కొత్తగా రూర్బన్ పంచాయతీలు ఏర్పాటు చేశారు. మార్కాపురం జిల్లాలో 406 పంచాయతీలు ఉండగా వాటిలో 8 రూర్బన్, 63 గ్రేడ్-1, 108 గ్రేడ్-2, 227 గ్రేడ్-3 పంచాయతీలుగా విభజించారు. రూర్బన్ పంచాయతీలకు గెజిట్ అధికారిని కార్యదర్శిగా నియమించనున్నారు.

News March 12, 2026

పొదిలి: వామ్మో.. ఇలానూ మోసం చేస్తారా..?

image

పొదిలిలో బుధవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. ఇదే సమయంలో ఓ రెస్టారెంట్ నిర్వాహకుడికి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి.. ‘మీకు లైసెన్స్ లేదు. తనిఖీలు చేయకుండా ఉండాలంటే రూ.60వేలు ఇవ్వండి’ అని కోరగా.. భయపడిన నిర్వాహకుడు రూ.6వేలు ఫోన్ పే చేశాడు. అసలు అధికారి తనిఖీలకు వెళ్లగా.. మీకు డబ్బులు పంపానని నిర్వాహకుడు చెప్పాడంతో ఆయన అవాక్కయ్యాడు. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News March 12, 2026

ప్రకాశం: వడగాల్పుల వేళ ముందస్తు చర్యలు

image

ప్రకాశం జిల్లాలో వడగాల్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు జిల్లా కలెక్టర్ రాజాబాబు అధికారులను అప్రమత్తం చేశారు. ఎండల కారణంగా ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధి హామీ పనుల సమయాల్లో మార్పులు చేయాలని, మధ్యాహ్నం పనులు నిలిపివేయాలని ఆదేశించారు. గ్రామాల్లో తాగునీటి బోర్లు మరమ్మతు చేసి, నీటి కొరత లేకుండా చూడాలని అన్నారు.