News August 1, 2024
శ్రీ సత్యసాయి: PIC OF THE DAY

శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలంలోని గుండుమలలో సీఎం చంద్రబాబు నేడు పర్యటించిన విషయం తెలిసిందే. ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొనడానికి ముందు గ్రామంలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా మహిళలు పలువురు చంద్రబాబుతో కలిసి ఫొటో దిగేందుకు పోటీపడ్డారు. సీఎం తమ గ్రామానికి వచ్చి గ్రామ వీధుల్లో తిరుగుతుండటంతో హర్షం వ్యక్తంచేశారు.
Similar News
News March 12, 2026
అనంతపురంలో YCP ఆవిర్భావ వేడుకలు

అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా సంక్షేమమే పరమావధిగా పార్టీ అడుగులు వేస్తుందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు. అనంతపురంలోని జిల్లా కార్యాలయంలో గురువారం పార్టీ 16వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
News March 12, 2026
ప్రత్యేక అధికారులను నియమించనున్న జిల్లా కలెక్టర్

అనంతపురం జిల్లాలో గ్రామపంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించే అధికారాన్ని కలెక్టర్ ఆనంద్‌కు కట్టబెడుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సర్పంచుల పదవీకాలం ఏప్రిల్ 2 నాటికి ముగియనుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. స్థానిక డీపీఓలు రూపొందించిన జాబితా మేరకు కలెక్టర్ అధికారులకు పంచాయతీల బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం.
News March 12, 2026
అనంతపురం జిల్లాకు 24వ ర్యాంకు

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు జిల్లాల వారీగా ర్యాంకులు ప్రకటించారు. సంక్షేమ పథకాలు, అధికారుల పనితీరుపై అనంతపురం జిల్లా రాష్ట్రస్థాయిలో 24వ స్థానంలో నిలిచింది. జిల్లాలో ప్రజల సంతృప్తి స్థాయి 64.6 నుంచి 66.6 శాతానికి పెరిగింది. పనితీరులో మరింత పురోగతి సాధించి మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్‌కు సీఎం ఆదేశాలు జారీ చేశారు.


