News August 1, 2024
గ్రేట్.. వారధి నిర్మించిన ‘సీత’
కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగి బీభత్సం సృష్టించిన వేళ సహాయక చర్యలు ముమ్మరం చేసేందుకు సైన్యం వారధి నిర్మించింది. 190 అడుగుల పొడవు ఉన్న ఈ బ్రిడ్జ్ నిర్మాణం ఓ మహిళా జవాన్ ఆధ్వర్యంలో జరగడం విశేషం. మేజర్ సీతా షెల్కే, మేజర్ అనీశ్‌తో కలిసి 16 గంటల్లోనే నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇది మహిళా సాధికారతకు, కష్టకాలంలో సమైక్యతకు నిదర్శనమని రక్షణ శాఖ ప్రతినిధి భరత్ భూషణ్ పేర్కొన్నారు.
Similar News
News February 3, 2025
టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్లు
* అభిషేక్ శర్మ-135(ఇంగ్లండ్‌పై)
* శుభ్‌మన్ గిల్- 126*(న్యూజిలాండ్‌పై)
* రుతురాజ్ గైక్వాడ్- 123*(ఆస్ట్రేలియాపై)
* విరాట్ కోహ్లీ- 122*(అఫ్గానిస్థాన్‌పై)
* రోహిత్ శర్మ- 121*(అఫ్గానిస్థాన్‌పై)
News February 2, 2025
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
AP: తిరుపతి జిల్లా పుత్తూరు-నగరి మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామాపురం వద్ద వేగంగా దూసుకు వచ్చిన లారీ ఓ ప్రైవేట్ బస్సును ఢీకొట్టిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటనలో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. లారీ తిరుత్తణి వైపు వెళ్లినట్లు స్థానికులు చెప్పారు. మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 2, 2025
వరల్డ్ కప్ విజేతలకు బీసీసీఐ నజరానా
అండర్-19 ఉమెన్స్ టీ20 టీమ్‌కు బీసీసీఐ రూ.5 కోట్ల బహుమతిని ప్రకటించింది. ఈ నగదును జట్టుతో పాటు స్టాఫ్‌కు అందించనున్నట్లు తెలిపింది. ఈరోజు జరిగిన అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 82 పరుగులకే ఆలౌట్ అవగా, భారత్ కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి వరల్డ్ కప్ గెలుచుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును మన తెలుగమ్మాయి గొంగడి త్రిష గెలుచుకున్నారు.