News August 1, 2024

శాలరీ క్రెడిటెడ్.. ఉద్యోగి ఆనందంపై లోకేశ్ ట్వీట్

image

AP: కూటమి పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు పడుతున్నాయని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఇవాళ ఉదయమే శాలరీ క్రెడిట్ అయిందంటూ ఓ ఉద్యోగి పలకపై రాసి చూపిస్తున్న వీడియోను ఆయన షేర్ చేశారు. ‘ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే పడిన జీతాలు. ఆనందమయ జీవితాలు. ఇదీ కూటమి ప్రభుత్వం సమర్థ పాలనకు నిదర్శనం’ అని లోకేశ్ ట్వీట్ చేశారు.

Similar News

News February 3, 2025

అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు నిరాశ

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. ‘తండేల్’ ఈవెంట్‌కు ఆయన ముఖ్య అతిథిగా వస్తారని భావించినా కొన్ని కారణాలతో రాలేకపోయారు. దీంతో చాలా కాలం తర్వాత AA స్పీచ్ విందామనుకున్న అభిమానులకు మరోసారి ఎదురుచూపులు తప్పలేదు. అల్లు అర్జున్ వస్తారనే ఈ ఈవెంట్‌కి ఫ్యాన్స్‌కు ఎంట్రీ నిషేధించారని సినీ వర్గాలు పేర్కొన్న సంగతి తెలిసిందే.

News February 3, 2025

టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్లు

image

* అభిషేక్ శర్మ-135(ఇంగ్లండ్‌పై)
* శుభ్‌మన్ గిల్- 126*(న్యూజిలాండ్‌పై)
* రుతురాజ్ గైక్వాడ్- 123*(ఆస్ట్రేలియాపై)
* విరాట్ కోహ్లీ- 122*(అఫ్గానిస్థాన్‌పై)
* రోహిత్ శర్మ- 121*(అఫ్గానిస్థాన్‌పై)

News February 2, 2025

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

image

AP: తిరుపతి జిల్లా పుత్తూరు-నగరి మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామాపురం వద్ద వేగంగా దూసుకు వచ్చిన లారీ ఓ ప్రైవేట్ బస్సును ఢీకొట్టిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటనలో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. లారీ తిరుత్తణి వైపు వెళ్లినట్లు స్థానికులు చెప్పారు. మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.