News August 1, 2024
మమ్మల్ని మన్నించండి కామ్రేడ్: మంత్రి నారా లోకేశ్

AP: శ్రీసత్యసాయి(D)లో ఇవాళ CM చంద్రబాబు పర్యటన సందర్భంగా CPM, ప్రజా సంఘాల నేతల్ని అరెస్ట్ చేయడాన్ని ఆ పార్టీ ఖండించింది. దీనిపై నారా లోకేశ్ స్పందించారు. ఈ ఘటన పట్ల మన్నించాలని కామ్రేడ్లను కోరారు. ‘గృహ నిర్బంధాలు, ముందస్తు అరెస్టులకు కూటమి ప్రభుత్వం వ్యతిరేకం. గత ఐదేళ్ల పరదాల ప్రభుత్వం పోయినా కొందరు పోలీసుల తీరు మారలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కులను కాపాడుతాం’ అని X వేదికగా తెలిపారు.
Similar News
News March 17, 2026
ప్రకాశం: బాలికపై అత్యాచారం.. నిందితుడికి 20 ఏళ్ల జైలు

10 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి ఒంగోలు పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా విధించింది. బేస్తవారిపేట(M) పూసలపాడుకు చెందిన మోతుకూరి కోలా పిచ్చయ్య(31)పై కేసు నమోదై దర్యాప్తు దర్వాప్తు నేరం రుజువైంది. ఈ సందర్భంగా బాధితురాలికి రూ.3 లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించినట్లు SP తెలిపారు. ముద్దాయికి శిక్ష పడడంలో కృషి చేసిన పోలీసులను SP అభినందించారు.
News March 17, 2026
‘ప్రభుత్వ’ ఇళ్లను అద్దెకు ఇస్తే రద్దు: పొంగులేటి

TG: డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివాసం ఉండని, అద్దెకు ఇస్తున్న వారికి నోటీసులివ్వాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. మే 1 నుంచి క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని, నోటీసులకు స్పందించకపోతే ఇళ్లను రద్దు చేయాలని సూచించారు. వాటిని అర్హులకు కేటాయించాలన్నారు. నోటీసులకు స్పందించిన వారితో తాము ఆ ఇంట్లోనే ఉంటామని, లేదంటే ప్రభుత్వానికి అప్పగిస్తామని బాండు పేపర్‌పై రాయించుకోవాలని పేర్కొన్నారు.
News March 17, 2026
బొప్పాయిలో గొంగళి పురుగు నివారణ ఎలా?

బొప్పాయి పంట చుట్టూ ఎర పంటలుగా అలసందలు, ఆముదం వేయాలి. కలుపు నివారించాలి. తొలి దశలో ఎకరాకు 2-3 దీపపు ఎరలను అమర్చాలి. ఆకు కింది భాగంలో లార్వాల నిర్మూలనకు వేప కషాయాన్ని పిచికారీ చేయాలి. గొంగళి పురుగుల నివారణకు లీటరు నీటికి క్లోరోపైరిపాస్ 2ml లేదా ప్రొపినోపాస్ 2ml లేదా క్వినాల్‌పాస్ 2ml కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఉద్ధృతి ఎక్కువ ఉంటే లీటరు నీటికి లామ్డాసైహలోత్రిన్ 1mlను కలిపి పిచికారీ చేయాలి.


