News August 1, 2024
ఇలాంటి పంచ్ నేనెప్పుడూ ఎదుర్కోలేదు.. మహిళా బాక్సర్ కన్నీళ్లు

ఒలింపిక్స్‌లో ఇమానే ఖలీఫ్ చేతిలో <<13755882>>ఓడిన<<>> బాక్సర్ ఏంజెలా కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘ఇంత గట్టి పంచ్ నేనెప్పుడూ ఎదుర్కోలేదు. ఫైట్ కంటిన్యూ చేయలేకపోయాను. ఈ విషయాన్ని ఒలింపిక్ కమిటీకి వదిలేస్తున్నాను’ అని చెప్పారు. గత ఏడాది మరణించిన తన తండ్రి కోసం మెడల్ గెలవాలని ఏంజెలా కలలు కన్నారు. కానీ ఖలీఫ్ పంచ్ వల్ల ముక్కు విరగడంతో పోటీ నుంచి తనకు తానుగా వైదొలిగారు.
Similar News
News April 4, 2026
పశ్చిమాసియా యుద్ధం.. నిర్మాణ రంగంపై భారం

పశ్చిమాసియా యుద్ధం దేశంలో నిర్మాణ రంగంపై పడింది. రంగులు, స్టీల్, సిమెంట్, టైల్స్, శానిటరీ వేర్ రేట్లు పెరిగాయి. పెట్రోలియం అనుబంధ ఉత్పత్తుల కొరతే దీనికి కారణం. బస్తా సిమెంట్ ధర ₹50 పెరగగా, స్టీల్ ధర టన్నుకు 18% పెరిగింది. ప్రొపేన్ గ్యాస్ సరఫరా తగ్గడంతో శానిటరీ వేర్ ధరలు 8-12% పెరిగినట్లు తెలుస్తోంది. ఇంధన కొరత సాకుతో రవాణా ఛార్జీల రూపంలో ఇటుక ధరలు కూడా ₹8 నుంచి ₹10-12కు పెంచినట్లు సమాచారం.
News April 4, 2026
నేవీ అమ్ములపొదిలోకి ‘అరిదమన్’

భారతీయ నౌకాదళంలోకి స్వదేశీ సాంకేతికతతో తయారైన అణు జలాంతర్గామి ‘అరిదమన్’ చేరింది. దీంతో నేవీ అమ్ములపొదిలోని న్యూక్లియర్ సబ్‌మెరైన్‌ల సంఖ్య మూడుకు పెరిగింది. ఇది INS అరిఘాట్, INS అరిహంత్‌తో పోలిస్తే అప్‌గ్రేడెడ్ వెర్షన్. ఈ జలాంతర్గామి 3,500 కిలోమీటర్ల రేంజ్‌కు వెళ్లే అణుసామర్థ్యం గల ఎనిమిది కే-4 మిసైళ్లను మోయగలదు. దీంతో పాటు 24 K-15 సాగరిక న్యూక్లియర్ మిసైల్స్‌ను కూడా మోసే సామర్థ్యం ఉంది.
News April 4, 2026
ఓడామని వదలొద్దు.. ప్రయత్నిస్తే విజయం తథ్యం

అనగననగ రాగమతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమ!
తాత్పర్యం: సంగీతం రానివారైనా రాగాలను పదేపదే ఆలపిస్తూ ఉంటే కొన్నాళ్లకు వినసొంపుగా పాడగలుగుతారు. వేప ఆకులు చేదుగా ఉన్నా రోజూ తింటూ ఉంటే కొన్నాళ్లకు తియ్యగా అనిపిస్తాయి. ఏ రంగమైనా సాధనతో నైపుణ్యం పెరిగి రాణిస్తారు. తొలిసారి విఫలమైనా తుదకు విజయం సాధిస్తారు.


