News August 2, 2024

మంత్రి లోకేశ్‌ను అభినందించిన బీజేపీ ఎంపీ

image

AP: సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో CPM, ప్రజాసంఘాల నేతల్ని పోలీసులు అరెస్ట్ చేయడం పట్ల లోకేశ్ క్షమాపణలు తెలపడంపై BJP MP జీవీఎల్ నరసింహారావు స్పందించారు. ‘లోకేశ్ గారు.. మీ శాఖలో జరిగిన తప్పు కాకపోయినా, పోలీసుల మితిమీరిన చర్యలకు మీరు క్షమాపణ చెప్పారు. అలాగే మీ విద్యాశాఖలో పథకాలకు తెలుగు ప్రముఖుల పేర్లు పెట్టారు. రాజకీయాల్లో మంచి సంప్రదాయాలకు తెరతీసిన మీకు అభినందనలు’ అని కొనియాడారు.

Similar News

News February 3, 2025

టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్లు

image

* అభిషేక్ శర్మ-135(ఇంగ్లండ్‌పై)
* శుభ్‌మన్ గిల్- 126*(న్యూజిలాండ్‌పై)
* రుతురాజ్ గైక్వాడ్- 123*(ఆస్ట్రేలియాపై)
* విరాట్ కోహ్లీ- 122*(అఫ్గానిస్థాన్‌పై)
* రోహిత్ శర్మ- 121*(అఫ్గానిస్థాన్‌పై)

News February 2, 2025

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

image

AP: తిరుపతి జిల్లా పుత్తూరు-నగరి మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామాపురం వద్ద వేగంగా దూసుకు వచ్చిన లారీ ఓ ప్రైవేట్ బస్సును ఢీకొట్టిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటనలో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. లారీ తిరుత్తణి వైపు వెళ్లినట్లు స్థానికులు చెప్పారు. మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News February 2, 2025

వరల్డ్ కప్ విజేతలకు బీసీసీఐ నజరానా

image

అండర్-19 ఉమెన్స్ టీ20 టీమ్‌కు బీసీసీఐ రూ.5 కోట్ల బహుమతిని ప్రకటించింది. ఈ నగదును జట్టుతో పాటు స్టాఫ్‌కు అందించనున్నట్లు తెలిపింది. ఈరోజు జరిగిన అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 82 పరుగులకే ఆలౌట్ అవగా, భారత్ కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి వరల్డ్ కప్ గెలుచుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును మన తెలుగమ్మాయి గొంగడి త్రిష గెలుచుకున్నారు.