News August 2, 2024
HYDలో పార్కింగ్ ఫీజులపై ఆమ్రపాలి కాట సీరియస్

నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని GHMC కమిషనర్ ఆమ్రపాలి కాట హెచ్చరించారు. నగరంలోని పలు మాల్స్, మల్టీప్లెక్స్, సినిమా థియేటర్లలో నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయమై తనిఖీలు చేయుటకు ప్రత్యేకంగా టీమ్స్ వేశారు. అక్రమాలు చేసిన ఆయా మాల్స్‌కు, మల్టీప్లెక్స్‌లకు నోటీసులు జారీ చేశారు.
Similar News
News February 26, 2026
HYDలో కీలక IAS అధికారుల బదిలీ

రాష్ట్రవ్యాప్తంగా IASల బదిలీలు జరిగాయి. ఇందులో GHMCకి జోనల్ కమిషనర్లుగా ఇద్దరు వచ్చారు. రాజేంద్రనగర్ ZC అనురాగ్ జయంతి యాదాద్రి భువనగిరి కలెక్టర్‌గా వెళ్లారు. ఆయన స్థానంలో మంద మకరందు ఛార్జ్ తీసుకోనున్నారు. కుత్బుల్లాపూర్ ZCగా పింకేశ్ కుమార్ నియమితులయ్యారు. ZC సందీప్ కుమార్ ఝా జనగామ కలెక్టర్‌గా వెళ్లారు. TGSPDCL సీఎండీని 3వ డిస్కం CMDగా బదిలీచేశారు. కొత్త సీఎండీగా జితేశ్ విపాటిల్ రానున్నారు.
News February 26, 2026
HYD: ఇంటర్ విద్యార్థుల కోసం హెల్ప్‌లైన్

TGBIE ప్రత్యేకంగా స్టూడెంట్స్ & పేరెంట్స్ హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పరీక్షలు, హాల్ టికెట్లు, ఫలితాలు తదితర అంశాలపై మార్గదర్శనం, సందేహాల నివృత్తికి సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు ఎగ్జామినేషన్ కంట్రోలర్ జయప్రదాభాయ్ తెలిపారు. హెల్ప్‌లైన్ నం. 040-24655027, IVR. No. 9240205555కు కాల్ చేసి విద్యార్థులు తమ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు. అవసరమైన సహాయం కోసం వెంటనే సంప్రదించాలని సూచించారు.
News February 26, 2026
HYD: ఫోన్ రిపేర్, ఐటీఐ, ల్యాండ్ సర్వేలో ఫ్రీ కోర్సు

ముస్లింలు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీ వర్గాలకు చెందిన 18- 35 ఏళ్ల యువత నుంచి ఉచిత శిక్షణ కోర్సులకు FEB 25- మార్చి 3 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఇలియాస్ అహ్మద్ తెలిపారు. ల్యాండ్ సర్వేయర్, ఎంఈపీ టెక్నీషియన్ (ఇంటర్/ఐటీఐ/డిప్లొమా), స్మార్ట్‌ఫోన్ రిపేర్ (టెన్త్) కోర్సులకు 3 నెలల శిక్షణ ఇస్తారు. ఆధార్, విద్యార్హత సర్టిఫికెట్‌లు, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అవసరం


