News August 2, 2024
తల్లిపాలు బిడ్డకు శ్రేయస్కరం: ప్రకాశం కలెక్టర్

తల్లి పాలు ఇవ్వడం ద్వారా పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వగలరని, దానిని ప్రథమ ప్రాధాన్యతగా తీసుకోవాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ అన్నారు. తల్లిగా తను కూడా ఇదే నిర్ణయం తీసుకున్నానని జిల్లా కలెక్టర్ తమీర్ అన్సారీ గురువారం పిలుపునిచ్చారు. ఒంగోలు GGH (రిమ్స్)లో బ్రెస్ట్ ఫీడింగ్ వారోత్సవాలను కలెక్టర్ లాంచనంగా ప్రారంభించారు. తల్లి పాలు బిడ్డకు అందించడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నారు.
Similar News
News March 10, 2026
మార్కాపురం మున్సిపాలిటీలో ఉద్యోగాల పేరిట రూ.కోటి టోకరా..?

మార్కాపురం మున్సిపాలిటీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఓ వ్యక్తి నమ్మబలికి రూ.కోటికి పైగా వసూలు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పారిశుద్ధ్య కార్మికులుగా చేర్పించడానికి ఒక్కొక్కరి వద్ద రూ.2 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలిసింది. గత ఏడాదిగా నియమకాలు లేకుండానే పనులు చేయించుకుంటున్నట్లు తెలిసింది. 15 నెలలు అవుతున్నా ఉద్యోగం రాకపోవడంతో తమ డబ్బులు వెనకకు ఇవ్వాలని బాధితులు అడగడంతో ఈ వ్యవహారం బయటపడింది.
News March 10, 2026
ప్రకాశం జిల్లాలో మిస్సింగ్ కేసులపై దృష్టి

మిస్సింగ్ కేసులు, NBW, మహిళలకు సంబంధించిన కేసులు, రోడ్డు ప్రమాదాల నివారణ, అలాగే స్వర్ణాంధ్ర విజన్‌కి పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ వంటి అంశాలపై సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో SP హర్షవర్ధన్ రాజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై అధికారులను అరా తీశారు. మిస్సింగ్ కేసుల ఛేదనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, చిన్నారులు, మహిళల అదృశ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
News March 10, 2026
మిస్సింగ్ కేసుల చేదనకు ప్రత్యేక దృష్టి సారించాలి: ప్రకాశం SP

మిస్సింగ్ కేసులు, NBW, మహిళలకు సంబంధించిన కేసులు, రోడ్డు ప్రమాదాల నివారణ, అలాగే స్వర్ణాంధ్ర విజన్‌కి పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ వంటి అంశాలపై సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై అధికారులను అరా తీశారు. మిస్సింగ్ కేసుల చేధనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, చిన్నారులు, మహిళల అదృశ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.


