News August 2, 2024
గిరిజనుల సేవ దేవుడిచ్చిన అవకాశం: సూరజ్

ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు సేవ చేయడం దేవుడు ఇచ్చిన అవకాశమని సూరజ్ గనోరే అన్నారు. ITDA POగా పని చేసి పదోన్నతిపై పల్నాడు జేసీగా వెళ్తున్న ఆయనను రంపచోడవరంలో అధికారులు, సిబ్బంది గురువారం సత్కరించారు. ఈ సందర్భంగా సూరజ్ మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి తనవంతు కృషి చేశానని, సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అని అన్నారు. పీవో కట్టా సింహాచలం, తదితరులు ఆయన చేసిన సేవలను కొనియాడారు.
Similar News
News February 27, 2026
తూ.గో: టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. రేపే లాస్ట్!

పదో తరగతి పబ్లిక్ పరీక్షలు-2026కు హాజరయ్యే విద్యార్థుల నామినల్ రోల్స్‌లో తప్పుల సవరణకు ప్రభుత్వం ప్రత్యేక అవకాశం కల్పించినట్లు DEO కె.వాసుదేవరావు తెలిపారు. విద్యార్థుల పేరు, పుట్టిన తేదీ, తదితర వివరాల్లో మార్పులు ఉంటే ఈనెల 28లోపు ఆన్‌లైన్‌లో సవరించుకోవాలని సూచించారు. ఇదేచివరి అవకాశమని, విద్యాసంస్థలు అప్రమత్తంగా ఉండి గడువులోగా ప్రక్రియ పూర్తి చేయాలని శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు.
News February 27, 2026
పెన్షన్‌దారులకు శుభవార్త.. ఒకరోజు ముందుగానే ‘సామాజిక భరోసా’

మార్చి నెల ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు ఒకరోజు ముందుగానే అందజేయనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. సాధారణంగా ప్రతి నెలా ఒకటో తారీఖున పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. అయితే, ఈసారి మార్చి 1వ తేదీ ఆదివారం కావడంతో, లబ్ధిదారుల సౌకర్యార్థం ఫిబ్రవరి 28వ తేదీ(శనివారం) నాడే పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు ఆమె శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
News February 27, 2026
కల్తీ పాలు, కలుషిత జలాల ఘటనలపై CM సమీక్ష

CM చంద్రబాబు గురువారం అమరావతి నుంచి తూ.గో, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కల్తీ పాలు, కలుషిత జలాల పరిస్థితిపై క్షేత్రస్థాయి సమీక్ష జరిపారు. జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ, MLA తదితరులు పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యంతో ముడిపడిన అంశాల్లో నిర్లక్ష్యం వహించవద్దని CM స్పష్టం చేశారు.


