News August 2, 2024
SRSP: 40,786 క్యూసెక్కులకు పెరిగిన ఇన్ ఫ్లో

ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీటి ఇన్ ఫ్లో పెరుగుతోంది. గురువారం ఉదయం 6 గంటల వరకు ప్రాజెక్టుకు ఇన్ ఫ్లోగా యావరేజ్ గా 5,166 క్యూసెక్కుల అది పెరుగుతూ రాత్రి 9 గంటలకు 40,786 క్యూసెక్కులుగా ఇన్ ఫ్లో పెరిగింది. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 80 టీఎంసీలకు గాను ప్రస్తుతం 37.891 టీఎంసీల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
Similar News
News December 25, 2025
నిజామాబాద్: ఏసుక్రీస్తు యావత్ ప్రపంచానికి దేవుడు: పీసీసీ చీఫ్

ఏసుక్రీస్తు యావత్ ప్రపంచానికి దేవుడని, ఆయన చూపిన ప్రేమ, కరుణా మార్గం మానవాళికి గొప్ప సందేశమని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. గురువారం గచ్చిబౌలిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి పౌరుడికి తన మతాన్ని ప్రార్థించే సంపూర్ణ స్వేచ్ఛ ఈ దేశంలో ఉందన్నారు. అన్ని మతాలను గౌరవించే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని అన్నారు.
News December 25, 2025
ధాన్యం సేకరణలో NZB జిల్లాకు మొదటి స్థానం

వానాకాలం సీజన్ కుసంబంధించి రాష్ట్రంలో ధాన్యం సేకరణ ముగిసింది. రాష్ట్రంలోని 32 జిల్లాల్లో మొత్తం 8,447 కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం మొత్తం 62,14,099 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. మొత్తం 12,04,591 మంది రైతుల వద్ద నుంచి సేకరించిన ధాన్యం విలువ రూ.14,840.11 కోట్లు. ధాన్యం సేకరణలో రాష్ట్ర వ్యాప్తంగా NZB జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. జిల్లాలో 7.02Mt లకు గాను 6,93,288 tnలు సేకరించారు.
News December 24, 2025
NZB: యాసంగికి నీటిని విడుదల చేసిన కొత్త సర్పంచులు

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి యాసంగి పంటల సాగు కోసం బుధవారం లక్ష్మీ కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు గేట్లు ఎత్తి 150 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఎస్సారెస్పీ సూపరింటెండింగ్ ఇంజినీర్ వి.జగదీష్ మాట్లాడుతూ.. ‘సివామ్’ (SCIWAM) కమిటీ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఆయకట్టుకు వారాబంది పద్ధతిలో నీటి సరఫరా ఉంటుందని తెలిపారు. రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.


