News August 2, 2024
ఉన్నత స్థానాలకు చేరిన వారు రిజర్వేషన్ వదులుకోవాలి: జస్టిస్ గవాయి

SC, ST వర్గీకరణపై <<13751609>>తీర్పు<<>> ఇస్తూ జస్టిస్ గవాయి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కొందరే రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నారు. ఈ రిజర్వేషన్లకూ క్రిమీలేయర్ వర్తింపజేయాలి. వీరిలో సంపన్నులను గుర్తించి, రిజర్వేషన్ల నుంచి తప్పించేలా విధానం రూపొందించాలి. రిజర్వేషన్‌తో అత్యున్నత స్థానాలకు చేరినవారు సొంతంగా ప్రయోజనాలు వదులుకోవాలి. వారికి, వారి పిల్లలకూ రిజర్వేషన్లు వర్తిస్తే మిగతా వారికి ఫలాలు అందవు’ అని అభిప్రాయపడ్డారు.
Similar News
News December 26, 2025
‘రుషికొండ’ను TTDకి అప్పగించాలి: BJP MLA

AP: విశాఖపట్నం రుషికొండ భవనాలను, కింద ఉన్న మరికొంత భూమిని ప్రముఖ హోటళ్లకు కేటాయించేలా ఇటీవల మంత్రుల కమిటీ చర్చించడం తెలిసిందే. ఈనెల 28న తుది నిర్ణయం తీసుకోనుంది. కాగా BJP MLA విష్ణు కుమార్ రాజు దీనిపై స్పందిస్తూ స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. ‘రుషికొండను ఆదాయవనరుగా చూడొద్దు. హోటళ్లకు ఇస్తే సామాన్యులకు దూరం అవుతుంది. TTDకి అప్పగించి ఆధ్యాత్మిక సిటీగా మార్చాలి’ అని కోరారు.
News December 26, 2025
ఛాంపియన్, శంబాల కలెక్షన్లు ఇవే?

నిన్న విడుదలైన ఛాంపియన్, శంబాల, దండోరా, ఈషా సినిమాలు పాజిటివ్ టాక్స్ తెచ్చుకున్నాయి. శ్రీకాంత్ కుమారుడు రోషన్ నటించిన ‘ఛాంపియన్’కు తొలిరోజు రూ.4.50 కోట్లు వచ్చినట్లు నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ప్రకటించింది. ఆది సాయికుమార్ నటించిన శంబాల మూవీకి రూ.3.3 కోట్లు వచ్చినట్లు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. హారర్ చిత్రం ఈషాకు రూ.1.6 కోట్లు వచ్చినట్లు టాక్. దండోరా కలెక్షన్లపై వివరాలు తెలియాల్సి ఉంది.
News December 26, 2025
రింకూ సింగ్ సెంచరీ

విజయ్ హజారే ట్రోఫీలో UP కెప్టెన్ రింకూ సింగ్ అదరగొట్టారు. చండీగఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 56 బంతుల్లోనే సెంచరీ చేశారు. ఆర్యన్ జుయల్ (134) కూడా చెలరేగడంతో UP 50 ఓవర్లలో 367/4 పరుగుల భారీ స్కోరు చేసింది. మరోవైపు గుజరాత్‌తో మ్యాచ్‌లో కోహ్లీ(77), పంత్(70) హాఫ్ సెంచరీలతో ఢిల్లీ 254/9 స్కోరు చేసింది. ఉత్తరాఖండ్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ విఫలమైనా హార్దిక్ తమోర్(93) రాణించడంతో ముంబై 331/7 కొట్టింది.


