News August 2, 2024
SPIRITUAL: 3రంగుల్లో దర్శనమిచ్చే జబల్‌పూర్ పచ్చమాత

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో నెలకొని ఉంది శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి పచ్చమాత ఆలయం. మూలవిరాట్టు ఉదయం తెల్లగా, మధ్యాహ్నం పసుపుగా, సాయంత్రం నీలంగా కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని 7 శుక్రవారాలు దర్శించుకుంటే ఆర్థిక బాధలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఇప్పుడున్న ఆలయాన్ని 1100 ఏళ్ల క్రితం గోండ్వానా పాలకులు నిర్మించారని స్థానికులు చెబుతున్నారు. అమ్మవారి పాదాలపై సూర్యకిరణాలు పడుతుండటం ఇక్కడి మరో విశేషం.
Similar News
News March 12, 2025
జొమాటో, స్విగ్గీకి పోటీగా ర్యాపిడో ఫుడ్‌డెలివరీ!

బైక్ ట్యాక్సీ కంపెనీ ర్యాపిడో త్వరలో ఫుడ్ డెలివరీ వ్యాపారంలోకి ప్రవేశించబోతోందని సమాచారం. ఇప్పటికే రెస్టారెంట్లతో చర్చలు ఆరంభించిందని తెలిసింది. జొమాటో, స్విగ్గీ వసూలు చేసే ప్రస్తుత కమీషన్ల ప్రక్రియను సవాల్ చేసేలా కొత్త బిజినెస్ మోడల్‌ను రూపొందిస్తోందని ఒకరు తెలిపారు. కొన్ని ఏరియాల్లో తమ టూవీలర్ ఫ్లీట్‌తో ఇండివిడ్యువల్ రెస్టారెంట్ల నుంచి ఇప్పటికే ఫుడ్ డెలివరీ చేస్తున్నట్టు తెలిసింది.
News March 12, 2025
వర్రా రవీందర్ రెడ్డికి రిమాండ్

AP: YCP సోషల్ మీడియా కన్వీనర్ వర్రా రవీందర్ రెడ్డికి జగ్గయ్యపేట కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను జగ్గయ్యపేట సబ్ జైలుకు తరలించారు. చంద్రబాబు, పవన్‌పై SMలో అసభ్య పోస్టులు పెట్టారని జగ్గయ్యపేట (M) చిల్లకల్లు PSలో ఆయనపై BNS, IT యాక్టులోని పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో నిన్న NTR జిల్లా చిల్లకల్లు పోలీసులు వర్రాను PT వారెంట్‌పై అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
News March 12, 2025
తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా

TG: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగం అనంతరం తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. కాసేపట్లో స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది. అంతకుముందు గవర్నర్ మాట్లాడుతూ ‘260 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తితో తెలంగాణ రికార్డు సృష్టించింది. రైతుల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం’ అని తెలిపారు.