News August 2, 2024

అనంతపురం జిల్లాలో 72 మంది ఉద్యోగులకు నోటీసులు

image

అనంతపురం జిల్లా వ్యాప్తంగా 72 మంది అధికారులకు కలెక్టర్ వినోద్ కుమార్ గురువారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నిన్న ఉదయం 9 గంటలు అవుతున్నప్పటికీ పింఛన్ పంపిణీ ప్రారంభించకపోవడంతో నిర్లక్ష్యం వహించినట్లు గుర్తించి నోటీసులు జారీ చేశారు. 2న తమ తమ శాఖల హెడ్‌కు వివరణ తప్పకుండా ఇవ్వాలని, లేకపోతే నిబంధన ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News September 30, 2024

అనంతపురం: 46 మంది పోలీసులకు ప్రశంసా పత్రాలు

image

అనంతపురం జిల్లాలో మంచి పనితీరు కనబర్చిన 46 మంది పోలీసు సిబ్బందికి SP జగదీష్ అభినందిస్తూ ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిందితులను సకాలంలో కోర్టు ముందు హాజరుపరిచి శిక్షలు పడేలా, హత్యా కేసుల్లో యావజ్జీవ శిక్షలు పడేలా కోర్టులకు సహకరించడం, ఏటీఎం కేసుల్లో ముద్దాయిలను అరెస్ట్ చేయడంలో కృషి చేశారన్నారు.

News September 30, 2024

రాష్ట్రస్థాయి పోటీలకు తాడిపత్రి అమ్మాయి

image

తాడిపత్రి పట్టణంలోని కస్తూర్బాలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని కొప్పల నందిని రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైనట్లు స్పెషల్ ఆఫీసర్ మునెమ్మ తెలిపారు. జిల్లా కేంద్రంలో జరిగిన స్కూల్ ఫెడరేషన్ గేమ్స్ జిల్లా స్థాయి పోటీలలో అండర్- 19 విభాగంలో ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ మేరకు విద్యార్థినిని పీఈటీ చంద్రకళ, ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు.

News September 30, 2024

వరద బాధితులకు తాడిపత్రికి చెందిన సంస్థ రూ.కోటి విరాళం

image

తాడిపత్రిలోని అర్జాస్ స్టీల్ ఎండీ శ్రీధర్ మూర్తి సీఎం చంద్రబాబునాయుడును సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయనిధికి రూ.కోటి చెక్కును అందజేశారు. అనంతపురం జిల్లాలో చేస్తున్న అభివృద్ధి, పెట్టుబడులు ఉద్యోగ కల్పన నైపుణ్య అభివృద్ధి గురించి సీఎంకు వివరించారు.