News August 2, 2024
లావణ్యపై రాజ్ తరుణ్ తల్లిదండ్రుల కేసు

లావణ్య తమను ఇబ్బందులకు గురిచేస్తోందని నటుడు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు మాదాపూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. తమ ఇద్దరికీ పలు అనారోగ్య సమస్యలున్నాయని తెలిపారు. ఆమె తమ ఇంటికి వచ్చి తలుపులు బాది, కేకలు వేసి న్యూసెన్స్ చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. లావణ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశారని లావణ్య ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
Similar News
News March 18, 2026
ఏప్రిల్ రెండో వారంలో ఇంటర్ ఫలితాలు

AP: రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు ఇవాళ్టితో ముగిశాయి. చివరి రోజున కెమిస్ట్రీ పరీక్షకు 3.87 లక్షల మంది హాజరయ్యారు. ఈనెల 21 నుంచి వాల్యుయేషన్ ప్రారంభమవుతుందని, ఏప్రిల్ రెండో వారంలో ఫలితాలు విడుదల చేస్తామని ఇంటర్ బోర్డ్ సెక్రటరీ పి.రంజిత్ బాషా తెలిపారు. వాల్యుయేషన్ పారదర్శకంగా, తప్పులు దొర్లకుండా చేయాలని అధ్యాపకులకు సూచించారు.
News March 18, 2026
ఉగాది ముహూర్తం.. సమయం ఇదే..

రేపటి నుంచి ‘పరాభవ’ నామ సంవత్సరం ప్రారంభం కానుంది. గురువారం ఉ.6 గం.53 ని.ల నుంచి ఉ.9.30 వరకు అత్యంత శ్రేష్ఠ ముహూర్తం ఉందని పండితులు తెలిపారు. ఈ సమయంలో పంచాంగం వినడంతో పాటు కొత్త పనులు ప్రారంభించాలని సూచించారు. తెల్లవారుజామునే నూనెతో స్నానం చేసి, ఉగాది పచ్చడి తాగాలని తెలిపారు. ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించాలని పేర్కొన్నారు.
News March 18, 2026
త్వరలో విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం

AP: విశాఖ రైల్వే జోన్ పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. జనరల్ మేనేజర్ (GM) సహా ఇతర ఉన్నతాధికారుల నియామక ప్రక్రియ పూర్తయ్యిందని పార్లమెంటులో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జోన్ ప్రధాన కార్యాలయం పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఎర్రుపాలెం – అమరావతి – నంబూరు మధ్య 57KM కొత్త రైల్వే లైన్ కోసం రూ. 2,047 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.


