News August 2, 2024
భారీ వర్షాల కారణంగా దంతేవాడ వరకే కిరండూల్ రైలు

భారీ వర్షాల కారణంగా విశాఖ-కిరండూల్ మధ్య నడిచే పలురైళ్లు గమ్యాలు కుదిస్తున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. ఈనెల 1 నుంచి 7 వరకు విశాఖ-కిరండూల్(08551) పాసింజర్ స్పెషల్, విశాఖ-కిరండూల్ (18514) ఎక్స్ ప్రెస్ రైళ్లు, ఈనెల 2 నుంచి 8 వరకు కిరండూల్-విశాఖ (08552) పాసింజర్ స్పెషల్, కిరండూల్-విశాఖ (18513) ఎక్స్‌ప్రెస్ దంతెవాడ వరకు నడవనున్నట్లు తెలిపారు.
Similar News
News March 31, 2026
విశాఖ: తణుకు TDR స్కాం వెనుక అసలు కథ(2/2)

తణుకు పురపాలక సంఘం 2021-22లో భూముల స్వాధీనం పేరుతో TDR బాండ్లు జారీ చేయడం వివాదానికి దారి తీసింది. సుమారు 21 ఎకరాల భూమికి గజాల లెక్కన రూ.800 కోట్ల విలువైన బాండ్లు ఇచ్చినట్టు ఆరోపణలు వచ్చాయి. మార్కెట్ విలువ కంటే 4 రెట్లు ఎక్కువగా బాండ్లు జారీ చేసినట్టు విమర్శలు వెల్లువెత్తాయి. అనంతరం ప్రభుత్వం బాండ్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టగా, కొనుగోలుదారులు హైకోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది.
News March 31, 2026
విశాఖ: తణుకు TDR బాండ్లకు మోక్షం(1/2)

తణుకు TDR బాండ్ల వివాదానికి ముగింపు లభించింది. హైకోర్టు ఆదేశాలతో బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న బాండ్లపై ఆంక్షలు తొలగాయి. స్టాంపులు & రిజిస్ట్రేషన్ శాఖ మెమో జారీ చేయడంతో రిజిస్ట్రేషన్లు మళ్లీ ప్రారంభమయ్యాయి. బ్యాంకులు కూడా రుణాలు మంజూరు చేయడం ప్రారంభించాయి. గతంలో ఇబ్బందులు ఎదుర్కొన్న బిల్డర్లకు ఇది పెద్ద ఊరటగా మారింది. ముఖ్యంగా విశాఖలో సుమారు 800 మంది బిల్డర్లకు ఈ నిర్ణయం ఉపశమనం కలిగించింది.
News March 31, 2026
క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడితే సమాచారం ఇవ్వండి: విశాఖ సీపీ

ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు ప్రారంభమైన నేపథ్యంలో బెట్టింగ్‌లకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపనున్నట్టు విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి సోమవారం తెలిపారు. నగరంలో బెట్టింగ్ నిర్వాహకులపై, ఆన్‌లైన్ బుకీలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలన్నారు. ఎక్కడైనా బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100, 112 నంబరుకు గానీ సీపీ నంబర్ 7995095799కి సమాచారం ఇవ్వాలన్నారు.


