News August 2, 2024

MDK: ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరిట మోసం

image

గుర్తు తెలియని యాప్‌లో ట్రేడింగ్ చేసి ఓవ్యక్తి రూ.లక్షలు పోగొట్టుకున్న ఘటన తూప్రాన్‌లో జరిగింది. SI శివానందం ప్రకారం.. పట్టణంలో వ్యాపారం చేసే ఓవ్యక్తి ఇన్‌స్టాలో వచ్చిన లింక్‌తో ఓ వాట్సాప్ గ్రూపులో యాడై IIFL అనే యాప్ డౌన్లోడ్ చేశాడు. పలు దఫాలుగా అందులో రూ.15లక్షల వరకు ట్రేడింగ్ చేయగా.. రూ.95లక్షలు ప్రాఫిట్ వచ్చింది. అయితే డబ్బు విత్ కాకపోవడంతో మోసపోయానని గ్రహించి బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

Similar News

News March 18, 2026

మెదక్: ‘కార్మిక సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలి’

image

మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు బుధవారం ఢిల్లీలోని ESIC ప్రధాన కార్యాలయంలో డైరెక్టర్ జనరల్ అశోక్ కుమార్ సింగ్‌ను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలోని కార్మికులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. సమస్యల పరిష్కారానికి ఆయన సానుకూలంగా స్పందించారు. కార్మిక సంక్షేమం కోసం మరిన్ని చర్యలు తీసుకోవాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు.

News March 18, 2026

నిజాంపేట: తిప్పన్నగుల్లలో కాకతీయ కాలపు శివాలయం గుర్తింపు

image

నిజాంపేట మండలం తిప్పన్నగుల్లలో కాకతీయ శైలికి చెందిన పురాతన శివాలయాన్ని ‘కొత్త తెలంగాణ చరిత్ర బృందం’ సభ్యుడు బుర్ర సంతోష్ గుర్తించారు. ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయంలో శివలింగం లేకపోయినా, లతలు, సింహాలు, హంసల చెక్కడాలతో కూడిన మూడు గర్భద్వారాలు అద్భుతంగా ఉన్నాయి. శైవ ద్వారపాలకుల శిల్పాలు ఈ ఆలయ విశిష్టతను చాటుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

News March 18, 2026

తునికి కృషి విజ్ఞాన కేంద్రంలో నేడు కిసాన్ మేళా

image

కౌడిపల్లి మండలం తునికి కృషి విజ్ఞాన కేంద్రంలో బుధవారం ‘కిసాన్ మేళా-2026’ నిర్వహిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి స్వప్న జాదవ్ తెలిపారు. సుమారు వెయ్యి మంది రైతులతో నిర్వహించే ఈ మేళాలో ఆధునిక యంత్రాల ప్రదర్శన, శాస్త్రవేత్తలతో ప్రత్యక్ష చర్చలు, సరికొత్త సాగు సాంకేతికతపై అవగాహన కల్పిస్తారు. ప్రభుత్వ పథకాలపై సమాచారం అందించనున్న ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.