News August 2, 2024

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి 29,960 క్యూసెక్కుల వరద నీరు

image

ఎగువ కురుస్తున్న వర్షాలకు శ్రీరామ్ ప్రాజెక్టులో భారీగా నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు సామర్థ్యం 1091 అడుగులు, 80.5 టీఎంసీలు ఉండగా.. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 29,960 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 2,695 క్యూసెక్కులు ఉంది. ప్రస్తుతం ఉదయం 6 గంటల వరకు ప్రాజెక్టులో 38.993 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వివిధ అవసరాల కోసం ప్రాజెక్ట్ నుంచి మొత్తం 684 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Similar News

News November 27, 2024

ఎంఈవోలు రోజుకో పాఠశాల సందర్శించాలి: కలెక్టర్ పమేలా

image

తమ మండలంలోని రోజుకో పాఠశాల సందర్శిస్తూ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి ఎంఈఓలకు సూచించారు. బుధవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లాలోని అన్ని మండలాల ఎంఈవోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. సరుకుల నిల్వ గది, రికార్డులు పరిశీలించి నాణ్యత పాటించేలా చూడాలన్నారు.

News November 27, 2024

సీఎం సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్, ఎమ్మెల్యే 

image

పెద్దపల్లిలో డిసెంబర్ 4న సీఎం పర్యటన నేపథ్యంలో సభ నిర్వహణకు అనువైన ప్రదేశాలను MLA విజయ రమణారావు కలెక్టర్ శ్రీహర్షతో కలిసి బుధవారం పరిశీలించారు. రంగంపల్లి-పెద్దకల్వల శివారులోని కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో సభ ఏర్పాట్లకు అనువుగా ఉంటుందని MLA తెలిపారు. సభా స్థలాన్ని శుభ్రం చేయాలని, గురువారం ఉదయం స్టేజ్ ఏర్పాటుకు HYD నుంచి ప్రత్యేక బృందం వస్తుందని చెప్పారు.

News November 27, 2024

ఉప్పల్ ఆర్వోబీ పనులు పూర్తి చేయాలని కేంద్ర మంత్రికి ఈటల వినతి

image

హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఉప్పల్‌లో పెండింగ్‌లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరారు. ఈ మేరకు ఢిల్లీలో అశ్వినీ వైష్ణవ్‌ను ఈటల కలిసి వినతి పత్రం అందజేశారు. అదే విధంగా కరోనా సమయంలో నిలిపివేసిన జర్నలిస్టుల రైల్వే పాసులు పునరుద్ధరించాలని కోరారు.