News August 2, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం పత్తి, మిర్చి ధరలు క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.19,500 జండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,300 జెండా పాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. మార్కెట్‌కు వచ్చే రైతులు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలని సూచించారు. కాగా నిన్నటి కంటే ఈరోజు ఏసీ మిర్చి ధర స్థిరంగా ఉండగా, పత్తి ధర మాత్రం 75 రూపాయలు పెరిగినట్లు తెలిపారు.

Similar News

News March 20, 2026

ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఖమ్మం జిల్లాలోని అర్హులైన షెడ్యూల్డ్ కులాల (SC) యువతీ యువకులకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంఘం కార్యనిర్వాహక సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు.అర్హులైన ఎస్సీ నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు www.tgobmms.cgg.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.

News March 20, 2026

తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ డిజైన్లపై కలెక్టర్ సమీక్ష

image

ఖమ్మం జిల్లాలో 9 ప్రభుత్వ పాఠశాలలను ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’గా అభివృద్ధి చేసేందుకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సమీక్ష నిర్వహించారు. నాబార్డ్ నిధులతో జీ+1 పద్ధతిలో తరగతి గదులు, ల్యాబ్స్, డైనింగ్ హాల్స్ వంటి అత్యాధునిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. నాణ్యమైన మెటీరియల్‌తో అత్యుత్తమ డిజైన్లు రూపొందించాలని, ప్రతి గదిలో గాలి, వెలుతురు ఉండేలా ప్లాన్ సిద్ధం చేయాలని ఆయన సూచించారు.

News March 20, 2026

రంజాన్‌కు పటిష్ట భద్రత: సీపీ సునీల్‌ దత్

image

ఖమ్మం: రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని కమిషనరేట్ పరిధిలో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు. శుక్రవారం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి గోళ్లగూడెం ఈద్గాను సందర్శించారు. సామూహిక ప్రార్థనల నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ వసతులు, బందోబస్తుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈద్గా నిర్వాహకులతో మాట్లాడి సౌకర్యాలను సమీక్షించారు.