News August 2, 2024
రాజాం విద్యార్థికి రూ.40 లక్షల ప్యాకేజ్‌తో ఉద్యోగం

రాజాంలోని జీఎంఆర్ ఐటీ కళాశాలకు చెందిన విద్యార్థి నిర్మల ప్రియ పారిస్‌లోని గ్రూప్ ADP అంతర్జాతీయ సంస్థలో 40 లక్షల జీతంతో ఉద్యోగానికి ఎంపికైనట్లు ప్రిన్సిపల్ ప్రసాద్ తెలిపారు. నిర్మల ప్రియ తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్ల గ్రామం వాసి. ఆమె తండ్రి వెంకట రావు ఓ సాధారణ క్యాటరింగ్ వ్యాపారి. సైబర్ సెక్యూరిటీ కోర్స్‌ను పూర్తి చేయడం ద్వారా ఈ కొలువును సాధించగలిగానని ఆమె అన్నారు.
Similar News
News January 1, 2026
‘శ్రీకాకుళం జిల్లాలో ఉపాధి వేతనదారులకు రూ.322 కోట్లు చెల్లించాం’

జిల్లాలో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఉపాధి వేతనదారులకు ఇప్పటివరకు ఆర్థిక సంవత్సరంలో రూ.322 కోట్ల చెల్లించడం జరిగిందని డ్వామా పీడీ లవరాజు తెలిపారు. బుధవారం సాయంత్రం జలుమూరులోని స్థానిక కార్యాలయంలో క్షేత్ర సహాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వేతనదారులకు మరో రూ.14 కోట్ల బకాయిలు ఉన్నాయన్నారు. ఇప్పటివరకు కోటి 36 లక్షల పది దినాలు పూర్తి అయ్యాయని పేర్కొన్నారు.
News January 1, 2026
2026ను స్వాగతించి..శుభాకాంక్షలు చెప్పిన ఇసుక కళాఖండం

ఎల్.ఎన్.పేట మండలం లక్ష్మీనర్సుపేట గ్రామానికి చెందిన ప్రముఖ సైకత శిల్పి ప్రసాద్ మిశ్రా వంశధార నది తీరంలో బుధవారం రూపొందించిన సైకత శిల్పం ఎంతగానో ఆకట్టుకుంటుంది. జనవరి ఒకటో తేదీ నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ 2026 ఆకృతిలో తీర్చిదిద్దిన కళారూపం చూపరులను కట్టిపడేసింది. కొత్త సంవత్సరంలో అన్ని వర్గాలకు మంచి జరగాలని ఈ ఇసుక కళాఖండంతో ఆయన ఆకాంక్షించారు.
News December 31, 2025
శ్రీకాకుళం: ఈ రైడ్ సేఫేనా?

చోదకులు హెల్మెట్ ధరించక యాక్సిడెంట్‌ల్లో ప్రాణాలొదిలిన ఘటనలు శ్రీకాకుళం జిల్లాలో తరచూ జరగుతుంటాయి. హెల్మెట్ ఆవశ్యకతను తెలియజేస్తూ పోలీసులు అవగాహన కల్పించినా..పెడచెవిన పెట్టి మృత్యువాత పడుతున్నారు. మరి కొందరు హెల్మెట్ ఉన్నా..బైకులు పక్కన పెట్టి డ్రైవింగ్ చేయడం శ్రీకాకుళం పట్టణంలో ఇవాళ కనిపించింది. పోలీసులు, ఫైన్‌ల నుంచి తప్పించుకోవడానికి తప్ప, వ్యక్తిగత భద్రతకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.


