News August 2, 2024
బేర్ పంజా.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 800కుపైగా పాయింట్లు కోల్పోయి 81,059కు చేరగా, నిఫ్టీ 270 పాయింట్ల నష్టంతో 24,741 వద్ద ట్రేడవుతోంది. ఆటో, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, మెటల్ రంగాల షేర్లు నష్టాలను నమోదు చేయడం మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది. టాటా మోటార్స్, ఐచర్ మోటార్స్, టాటా స్టీల్ 3%కుపైగా నష్టపోగా.. JSW స్టీల్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 2%కుపైగా లాస్ అయ్యాయి.
Similar News
News November 5, 2025
పేదలను ఓటు వేయనీయకండి: కేంద్ర మంత్రి

ఎన్నికల రోజు పేదలను పోలింగ్ బూత్‌కు రాకుండా అడ్డుకోండి అంటూ కేంద్రమంత్రి, JDU నేత రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బిహార్‌లోని మొకామాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ‘పేదలను ఓటు వేయకుండా అడ్డుకోండి’ అంటూ ఆయన పిలుపునిచ్చారు. ఈ వీడియో వైరలవ్వడంతో పట్నా జిల్లా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఎన్నికల కమిషన్ కూడా వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది.
News November 5, 2025
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 750 పోస్టులు

<
News November 5, 2025
ఉసిరి దీపాన్ని ఎలా తయారుచేసుకోవాలి?

కార్తీక మాసంలో ఉసిరి దీపం పెట్టడం అత్యంత పవిత్రమైన ఆచారం. ఈ దీపాన్ని వెలిగించడానికి గుండ్రని ఉసిరికాయను తీసుకుని, దాని మధ్య భాగంలో గుండ్రంగా కట్ చేయాలి. ఆ భాగంలో స్వచ్ఛమైన నూనె లేదా ఆవు నెయ్యి వేయాలి. ఆ నూనెలో వత్తి వేసి వెలిగించాలి. ఇలా ఉసిరి దీపాన్ని వెలిగించడం వల్ల సకల దేవతల అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. నవగ్రహ దోషాలు తొలగి ఇంట్లో సుఖశాంతులు చేకూరుతాయని భక్తుల నమ్మకం.


