News August 2, 2024
హార్దిక్ కొడుకు బర్త్‌డే వేడుకలు.. నటాషాపై విమర్శలు

ఇటీవల హార్దిక్ పాండ్యతో విడిపోయిన తర్వాత నటాషా.. కొడుకు అగస్త్యను తీసుకొని సెర్బియా వెళ్లిపోయారు. గతనెల 30న అతడి బర్త్‌డే సందర్భంగా నిర్వహించిన వేడుకల ఫొటోలను ఆమె నిన్న ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. దీనిపై హార్దిక్ ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడ్డారు. ‘ఆ పిల్లాడికి తండ్రిని దూరం చేశావ్’ అని కొందరు కామెంట్ చేయగా, ‘సానుభూతి పొందేందుకు విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తోంది’ అని మరికొందరు విమర్శించారు.
Similar News
News February 13, 2026
గెలిచిన మా అభ్యర్థులను లాక్కునే ప్రయత్నం: KTR

TG: మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన తమ అభ్యర్థులను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని, పోలీసులతో బెదిరిస్తున్నారని BRS నేత కేటీఆర్ ఆరోపించారు. గద్వాలలోని ఓ వార్డులో 4 సార్లు రీకౌంటింగ్ చేయించి కాంగ్రెస్ అభ్యర్థిని ఒక ఓటుతో గెలిపించుకున్నారని మండిపడ్డారు. వర్ధన్నపేట, చౌటుప్పల్‌లోనూ ఇలాగే చేశారని చెప్పారు. 16 మున్సిపాలిటీల్లో నేరుగా గెలుస్తున్నామని, మరో 10-15 చోట్ల BRS లార్జెస్ట్ పార్టీ అని తెలిపారు.
News February 13, 2026
నీట్ ర్యాంకులతో B.Sc నర్సింగ్ కోర్సులో ప్రవేశాలు

AP: నాలుగేళ్ల B.Sc (నర్సింగ్) కోర్సులో ప్రవేశాలను నీట్-UG పరీక్ష ర్యాంకుల ఆధారంగా కల్పించాలని GOVT నిర్ణయించింది. గతంలో ఇంటర్, ఈఏపీసెట్ ఆధారంగా ఈ కోర్సులో ప్రవేశాలు జరగ్గా గత ఏడాది APNCET పెట్టారు. అయితే 16000 సీట్లకు గాను 4000 మిగిలిపోయాయి. దీంతో వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ తాజా ప్రతిపాదనలు సమర్పించగా CM ఆమోదించారు. ఈ కోర్సులో ప్రవేశాలు కోరుకొనే వారు 2026-27 నుంచి నీట్-UG పరీక్ష రాయాల్సి ఉంటుంది.



