News August 2, 2024
సీఎంగా తప్పుకొనేది లేదు: సిద్దరామయ్య

మైసూరు నగరాభివృద్ధి సంస్థ(ముడా) స్కామ్‌లో కర్ణాటక సీఎం సిద్దరామయ్య విచారణకు హాజరుకావాలంటూ గవర్నర్ థావర్ నోటీసులు పంపించడం కలకలం రేపుతోంది. అయితే గవర్నర్ విచారణకు ఆదేశించినా సరే తాను సీఎంగా తప్పుకొనేది లేదని సిద్దరామయ్య పార్టీ నేతలకు కుండబద్దలు కొట్టినట్లు తెలుస్తోంది. ఆరోపణలపై చట్టప్రకారం పోరాడతానని ఆయన చెప్పారట. మరోవైపు క్యాబినెట్ సైతం గవర్నర్ తీరును తప్పుపడుతూ లేఖ రాయనున్నట్లు సమాచారం.
Similar News
News January 9, 2026
ఈ మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం వద్దు

మన ఇళ్లు, పొలాల గట్ల దగ్గర పెంచుకోదగ్గ మొక్కల్లో అరటి, బొప్పాయి, జామ, నిమ్మ, ఉసిరి, మునగ, అవిసె, పందిరి చిక్కుడు, బచ్చలి, గుమ్మడి, కరివేపాకు, కుంకుడు మొదలైనవి ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఈ మొక్కలను ఒకసారి నాటితే ఎక్కువకాలం ఫలాలనిస్తాయి. వీటి పెంపకానికి పెద్దగా ఖర్చు కానీ, యాజమాన్యం కానీ అవసరం ఉండదు. ఇవి తక్కువ విస్తీర్ణంలో పెరుగుతూ ఎక్కువ పోషక విలువలు గల ఆహారాన్నిస్తూ మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
News January 9, 2026
మంత్రి చెప్పినా ఎందుకు పెంచారు.. టికెట్ ధరలపై HC ఆగ్రహం

TG: ‘రాజా సాబ్’ టికెట్ రేట్ల పెంపుపై హైకోర్టు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పదే పదే రేట్లు ఎందుకు పెంచుతున్నారని ప్రశ్నించింది. ఎన్నిసార్లు చెప్పినా మీ ఆలోచనా విధానం మారదా? అని ఫైరయింది. టికెట్ రేట్లు పెంచబోమని మంత్రి ప్రకటించినా ఎందుకు మెమోలు జారీ చేస్తున్నారని ప్రశ్నించింది. మెమో ఇచ్చిన అధికారికి రూల్స్ తెలియవా? అని నిలదీసింది. కాగా అర్ధరాత్రి టికెట్ రేట్ల పెంపుపై ఓ లాయర్ కోర్టుకెళ్లారు.
News January 9, 2026
శబరిమల ఆలయ ప్రధాన పూజారి అరెస్ట్

శబరిమల <<18734389>>బంగారం చోరీ<<>> కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆలయ ప్రధాన పూజారి కందరారు రాజీవరును SIT అరెస్టు చేసింది. కేరళలోని ప్రఖ్యాత అయ్యప్ప స్వామి ఆలయంలోని విగ్రహాల బంగారు తాపడం బరువులో తేడాలపై దాఖలైన కేసును SIT దర్యాప్తు చేస్తోంది.


