News August 2, 2024

సిరిసిల్ల: డెంగ్యూతో మహిళ మృతి

image

సిరిసిల్ల జిల్లాలో విషాదం నెలకొంది. స్థానికుల వివరాల ప్రకారం.. చందుర్తి మండలం మర్రిగడ్డకు చెందిన అంజలి(53) ఐదు రోజుల క్రితం అనారోగ్యం బారిన పడగా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి డెంగ్యూతో పాటు ఊపిరితిత్తుల్లో నీరు చేరిందని నిర్ధారించారు. దీంతో కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో HYD తరలిస్తుండగా మార్గమధ్యలో గురువారం రాత్రి మృతిచెందింది.

Similar News

News October 8, 2024

పెద్దపల్లి: రైల్వే అధికారులకు వినతిపత్రం అందజేసిన ఎంపీ

image

పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని పెద్దపల్లి, ఓదెల రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, రెచ్నిలలో కొత్త రైళ్ల ప్రారంభం, పాత రైళ్ల పునరుద్ధరణ అభివృద్ధి కోసం నేడు పెద్దపెల్లి ఎంపీ గడ్డ వంశీకృష్ణ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో కలిసి రైల్వే అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన రైల్వే ప్రయాణం అందించడం కొరకు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు.

News October 8, 2024

పెద్దపల్లి: ఉపాధికి ఉడుంపట్టు.. కాటమయ్య రక్షణ కవచం

image

కల్లుగీత కార్మికుల ప్రాణ రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది. గీత కార్మికులు చెట్టు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు పట్టు జారకుండా ప్రత్యేక పరికరాలను అందజేస్తోంది. కాటమయ్య రక్షణ కవచం పేరిట ఆరు రకాల పరికరాల కిట్టును పంపిణీ చేస్తోంది. పెద్దపల్లి జిల్లాలో ఇప్పటికే ఉచిత శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అవి పూర్తి కాగానే రక్షణ కవచాలను గీత కార్మికులకు ఉచితంగా అందజేయనుంది.

News October 8, 2024

KNR: సంతలో మహిళపై పండ్ల వ్యాపారి చెప్పుతో దాడి

image

కరీంనగర్ జిల్లా కేశవపట్నం వారసంతలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. సోమవారం సంతలో పండ్లు అమ్ముకునే వ్యక్తి పక్కనే పూలు అమ్ముకునే మహిళపై అసభ్యంగా తిడుతూ చెప్పుతో దాడి చేశాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు గొడవ సద్దుమణిగేలా చేసి మహిళను అక్కడినుంచి పంపించారు. అయితే కొట్టిన వ్యక్తిని వదిలిపెట్టి దెబ్బలు తిన్న మహిళనే అక్కడినుంచి పంపేయడంతో పోలీసులు ఆ వ్యక్తికే వత్తాసు పలకడం పట్ల స్థానికులు విమర్శిస్తున్నారు.