News August 2, 2024
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు పోటేత్తుతోన్న వరద

నాగార్జునసాగర్ జలాశయానికి భారీ ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయానికి 3,88,878 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా ఔట్ ఫ్లో 28,878 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 590అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 546 అడుగులుగా ఉంది. నీటి నిలువ సామర్థ్యం 312.50టీఎంసీలు కాగా, ప్రస్తుతం 201.91 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నాలుగు రోజుల్లో ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది.
Similar News
News December 28, 2025
జిల్లా అధ్యక్షుడి తీరుపై అధిష్ఠానం సీరియస్..!

నల్డొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణపై పార్టీ అధిష్ఠానం స్పందించింది. వాజ్‌పేయి జయంతి వేడుకల్లో జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి సమక్షంలోనే నాయకుడు పిల్లి రామరాజుపై జరిగిన దాడిని రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనతో పార్టీ ప్రతిష్ఠ దెబ్బతిందని భావించిన రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు.. వర్షిత్‌రెడ్డిని పిలిపించి మందలించినట్లు తెలుస్తోంది.
News December 28, 2025
NLG: ముందుగానే మున్సి ‘పోల్స్’….!

మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం రెడీ అవుతుంది. కేంద్రం నుంచి మున్సిపాలిటీలకు వివిధ పథకాల కింద గ్రాంట్లు, కేంద్ర ఆర్థిక సంఘం నిధులను రాబట్టుకునేందుకే ఈ ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఉమ్మడి జిల్లాలో 19 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఎప్పుడు షెడ్యూల్ వచ్చినా… ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తొంది.
News December 28, 2025
వణికిస్తున్న చలి.. పెరిగిన వైరల్ జ్వరాల ఉద్ధృతి

ఉమ్మడి జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 14-16 డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. వేకువజామున వీస్తున్న చలిగాలులతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ మార్పుల వల్ల జిల్లావ్యాప్తంగా వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. చిన్నారులు, వృద్ధులు జలుబు, దగ్గు, జ్వరంతో ఆసుపత్రుల బాట పడుతున్నారు.


