News August 2, 2024

ధరణిని కొనసాగిస్తాం: మంత్రి పొంగులేటి

image

TG: రాష్ట్రంలో ధరణిని కొనసాగిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. కానీ ధరణి విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పులను తమ సర్కార్ చేయదని చెప్పారు. ‘ధరణి పేరు మార్చి, చట్టాన్ని సవరిస్తాం. ఈ విషయంలో ప్రతిపక్ష సలహాలు, సూచనలు స్వీకరిస్తాం. దీనిపై రాద్ధాంతం చేస్తే గత ఎన్నికలకు మించిన ఘోర పరాభవం ఎదుర్కొంటారు’ అని ఆయన హెచ్చరించారు.

Similar News

News July 7, 2025

తెలంగాణ కాంగ్రెస్ ఉమ్మడి జిల్లాల ఇన్‌ఛార్జులు

image

* ఖమ్మం- వంశీచంద్ రెడ్డి, * మెదక్- పొన్నం ప్రభాకర్
* నల్గొండ- సంపత్ కుమార్
* వరంగల్- అడ్లూరి లక్ష్మణ్
* హైదరాబాద్- జగ్గారెడ్డి
* మహబూబ్‌నగర్- కుసుమకుమార్
* ఆదిలాబాద్- అనిల్‌ యాదవ్
* కరీంనగర్- అద్దంకి దయాకర్
* నిజామాబాద్- హుస్సేన్
* రంగారెడ్డి- శివసేనారెడ్డి

News July 7, 2025

కిలోకు రూ.12 చెల్లించి మామిడి కొనుగోళ్లు

image

AP: మద్దతు ధర లేక అల్లాడుతున్న తోతాపురి మామిడి రైతులకు ప్రభుత్వం ఆదుకుంటోంది. ప్రస్తుతం కేజీకి రూ.8 చెల్లిస్తుండగా, ప్రభుత్వం అదనంగా రూ.4 ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కిలో మామిడికి రూ.12 చెల్లిస్తున్నారు. చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో 3.08 మెట్రిక్ టన్నుల మేర మామిడిని ట్రేడర్లు, ప్రాసెసింగ్ యూనిట్ల వారు కొనుగోలు చేశారు.

News July 7, 2025

అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్‌కు ప్రభుత్వం ఆమోదం

image

AP: అమరావతి <<16882676>>క్వాంటమ్ వ్యాలీ<<>> డిక్లరేషన్‌ను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2035 నాటికి అమరావతిని ప్రపంచ క్వాంటమ్ కేంద్రంగా అభివృద్ధి చేయడమే దీని లక్ష్యమని తెలిపింది. దేశంలోనే అతిపెద్ద క్వాంటమ్ బెడ్‌గా క్వూ-చిప్-ఇన్‌ను వచ్చే 12 నెలల్లో ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. 2026లో ప్రారంభమయ్యే అమరావతి క్వాంటమ్ అకాడమీ ద్వారా శిక్షణ, ఫెలోషిప్‌లు అందజేయాలని నిర్ణయించింది.