News August 2, 2024
యువతిపై అత్యాచారం కేసులో నిందితుడి అరెస్టు

యువతిపై అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న శివాజీ రెడ్డిని వనస్థలిపురం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి యువతి(24)పై అత్యాచారం జరిగింది. ప్రధాన నిందితుడైన గౌతంరెడ్డి మంగళవారం రాత్రి అరెస్టయ్యాడు. మరో నిందితుడైన శివాజీ రెడ్డి గుంటూరుకు పారిపోయాడు. గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. శివాజీ రెడ్డి స్వగ్రామం యాదాద్రి జిల్లా చౌటుప్పల్ సమీపంలోని ఆరెగూడెం.
Similar News
News March 11, 2025
టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు ఫలితాలు విడుదల

2025 జనవరిలో నిర్వహించిన టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు (టీసీసీ) పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయని డీఈఓ భిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు. మెమోలు www.bse.telangana.gov.in వెబ్ సైట్లో ఉన్నాయని పేర్కొన్నారు. అభ్యర్థులు వారి రోల్ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేసుకుని మెమోలు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
News March 11, 2025
NLG: 20 వరకు ప్రవేశానికి దరఖాస్తులు

తెలంగాణ ఆదర్శ పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి, ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు మిగిలిన సీట్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నల్గొండ జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం బిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కల విద్యార్థులు ఈనెల 20 లోగా దరఖాస్తులు చేసుకోవాలని ఆయన సూచించారు.
News March 11, 2025
నల్గొండ: ‘పరువు హత్యలు ఇకనైనా ఆగాలి!’

2018లో మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య కేసుకు సంబంధించి కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే ఉమ్మడి జిల్లాలో ప్రణయ్ హత్య తర్వాత జరిగిన పరువు హత్యలు చర్చకు వస్తున్నాయి. కులాంతర వివాహం చేసుకున్నాడని భువనగిరిలో రామకృష్ణను, ఇటీవలే సూర్యాపేటలో మాల బంటిని హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుతో అయినా పరువు హత్యలు జరగకుండా ఉంటాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.