News August 2, 2024

రెండు రైళ్లకు జనరల్ కోచ్ జతచేసిన రైల్వే అధికారులు

image

పలాస, శ్రీకాకుళం రోడ్ మీదుగా భువనేశ్వర్, చెన్నై సెంట్రల్ మధ్య ప్రయాణించే 2 రైళ్లకు అదనంగా 1 జనరల్ కోచ్‌‌ జత చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.12830/12829 సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌‌కు 1 అదనపు జనరల్ కోచ్ జత చేస్తున్నామన్నారు. నం.12830 రైలుకు ఆగస్టు 8 నుండి సెప్టెంబర్ 26 వరకు, నం.12829 రైలుకు ఆగస్టు 9 నుండి సెప్టెంబర్ 27 వరకు అదనపు జనరల్ కోచ్‌తో నడుపుతామన్నారు.

Similar News

News March 11, 2026

కోటబొమ్మాళి: భర్తపై భార్య దాడి

image

భర్తపై భార్య దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన కోటబొమ్మాళి మండలం మంచాలపేటలో జరిగింది. భర్తను సోదరిడితో కలిసి ఓ గదిలో బంధించి కొట్టగా తీవ్ర గాయాలపాలయ్యాడు. అనంతరం గమనించిన కుటుంబీకులు తక్షణం సమీప ఆసుపత్రిలో చేర్చారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 11, 2026

శ్రీకాకుళం పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం

image

పదో తరగతి పబ్లిక్ పరీక్షల సందర్భంగా విద్యార్థులకు ఏపీఎస్‌ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు బస్సుల్లో హాల్ టికెట్ చూపించి పరీక్షా కేంద్రానికి వెళ్లేందుకు విద్యార్థులు ఉచితంగా ప్రయాణించవచ్చని జిల్లా ప్రజా రవాణా అధికారి సీహెచ్ అప్పల నారాయణ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సౌకర్యాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News March 11, 2026

ఎచ్చెర్ల: రిజల్ట్స్ విడుదల

image

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ 3వ సెమిస్టర్ రెగ్యులర్, సప్లమెంటరీ పరీక్షల ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఈ మేరకు యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారి డాక్టర్ అనురాధ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఫలితాలను యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు ఆమె వెల్లడించారు. https://brau.edu.in/ వెబ్‌సైట్‌ను విద్యార్థులు చూడాలని పేర్కొన్నారు.