News August 2, 2024

భీమవరంలో కారుపై విరిగిపడిన హోర్డింగ్

image

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని ప్రకాశం చౌక్ సెంటర్‌లో ఓ కారుపై భారీ హోర్డింగ్ విరిగిపడింది. షాపు ముందు కారు పార్క్ చేస్తున్న సమయంలోనే బోర్డు పడిపోవడంతో ముందు భాగం దెబ్బతింది. అయితే.. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమి కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Similar News

News February 24, 2026

కేసుల పరిష్కారంలో సాంకేతికతను వాడాలి: ఎస్పీ

image

జిల్లాలోని పోలీస్ అధికారులతో ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మి మంగళవారం భీమవరం ఆయన కార్యాలయంలో నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్‌లో నెలవారీ నేర సమీక్ష చేపట్టారు. దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ విధానాన్ని విరివిగా ఉపయోగించాలని ఆయన సూచించారు. నిర్దేశిత కాలపరిమితిలో ఛార్జ్ షీట్లు దాఖలు చేయాలని, మార్చి 14న జరిగే లోక్ అదాలత్ ద్వారా గరిష్ఠ స్థాయిలో కేసులు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News February 24, 2026

ఆర్‌యూబీ నిర్మాణాలకు భూసేకరణ వేగవంతం చేయాలి: జేసీ

image

భీమవరం కలెక్టరేట్ నుంచి మంగళవారం రైల్వే కన్స్ట్రక్షన్ అధికారులు, వివిధ శాఖల ప్రతినిధులతో జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి గూగుల్ మీట్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాలో అనుమతులు లభించిన నవాబ్ పాలెం (378), పత్తిపాడు (376), ఆరుగొలను (379) లెవల్ క్రాసింగ్ గేట్ల వద్ద రైల్వే అండర్ బ్రిడ్జిల (RUB) నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.

News February 24, 2026

BREAKING: భీమవరంలో ACBకి చిక్కిన ఫారెస్ట్ అధికారి

image

భీమవరం పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో అవినీతి నిరోధక శాఖ(ACB) అధికారులు జరిపిన దాడులు కలకలం రేపాయి. భీమవరం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సురేశ్ రూ.4 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఒక పనికి సంబంధించి బాధితుడి నుంచి నగదు డిమాండ్ చేయడంతో అధికారులు నిఘా పెట్టి పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు, ఆయన నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు.