News August 2, 2024

నీరజ్ స్వర్ణం గెలిస్తే.. కస్టమర్లకు ఫ్రీ వీసా ఆఫర్!

image

అట్లిస్ CEO మోహక్ ప్రకటించిన ఫ్రీ వీసా ఆఫర్ SMలో బజ్ క్రియేట్ చేసింది. ‘ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా స్వర్ణం గెలిస్తే ప్రతి ఒక్కరికీ ఫ్రీగా వీసా పంపిస్తా’ అని జులై 30న ఆయన లింక్డిన్‌లో పోస్టు పెట్టారు. వెంటనే.. ఫ్రీగా ఇస్తారా? ఎందరికి ఇస్తారు? వివరాలేంటని ప్రశ్నల వర్షం కురిసింది. దీంతో ‘ఒకరోజు ఒకరికి ఒక ఫ్రీ వీసా ఇస్తాను’ అని ఆయన జవాబిచ్చారు. ప్రతిదీ ప్రచారం కోసమేనా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

Similar News

News February 3, 2025

కుంభమేళాలో భక్తుల భద్రతపై నేడు సుప్రీంలో విచారణ

image

కుంభమేళాలో ఇటీవల జరిగిన తొక్కిసలాటపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇవాళ విచారించనుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గైడ్‌లైన్స్ ఇవ్వాలని పిటిషనర్ కోర్టును కోరారు. చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రత్యర్థులుగా పిటిషనర్ పేర్కొన్నారు.

News February 3, 2025

ప్రభుత్వ స్కూళ్లలో తగ్గుతున్న అడ్మిషన్లు.. సర్కార్ కీలక నిర్ణయం

image

TG: ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సర్కార్ విద్యాసంస్థల్లో అందిస్తున్న సౌకర్యాలు, వస్తున్న ఫలితాల గురించి ప్రజలకు తెలిసేలా వివరించనుంది. అడ్మిషన్లు పెరిగేలా చర్యలు చేపట్టనుంది. దీనికోసం FB, X, WHATSAPP వంటి సోషల్ మీడియా వేదికల్లో స్పెషల్ గ్రూపులను క్రియేట్ చేయనుంది. వీటిని స్పెషల్ ఆఫీసర్లు పర్యవేక్షిస్తారని సమాచారం.

News February 3, 2025

ఆత్మీయ భరోసా.. నిలిచిపోయిన డబ్బుల జమ?

image

TG: MLC ఎన్నికలు జరిగే జిల్లాల్లో ఎలక్షన్ కోడ్ కారణంగా ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ డబ్బుల జమ నిలిచిపోయినట్లు సమాచారం. తొలి విడతలో 18,180 మంది లబ్ధిదారుల ఖాతాల్లో ₹10.90crకు పైగా ప్రభుత్వం జమ చేసింది. ఈ స్కీమ్‌కు 5.80L మందిని ఇప్పటికే అర్హులుగా గుర్తించింది. కొత్త దరఖాస్తులను పరిశీలిస్తోంది. కుటుంబంలో ఏ ఒక్కరి పేరు మీద సెంటు భూమి ఉన్నా ఆ ఫ్యామిలీలోని వారిని అనర్హులుగా గుర్తిస్తున్నట్లు సమాచారం.