News August 2, 2024
NZB: చిన్నారిపై లైంగిక దాడి.. పోక్సో కేసు

నిజామాబాద్ నగరంలో ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడగా నిందితుడిపై పోక్సో కేసు నమోదుచేసినట్లు టూ టౌన్ ఎస్సై రాము తెలిపారు. పూసలగల్లీ ప్రాంతంతో ఓ బాలిక(5) ఇంటి ఎదుట ఆడుకుంటుండగా గణేశ్ అనే వ్యక్తి అక్కడికి వచ్చాడు. చాక్లెట్ ఇప్పిస్తానంటూ బాలికను తన ఇంటికి తీసుకువెళ్లి లైంగికదాడికి పాల్పడినట్లు బాధిత కుటుంబసభ్యులు గురువారం ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామని SI తెలిపారు.
Similar News
News March 5, 2026
NZB: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో ఆరోగ్య కార్యక్రమాలు: డీఎంహెచ్‌వో

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 99 రోజుల ఆరోగ్య కార్యక్రమాల ప్రణాళికను సిద్ధం చేయడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీ తెలిపారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జిల్లా ఉప వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా మాతా శిశు మరణాలతో పాటు నెల లోపు శిశువుల మరణాల సంఖ్యను తగ్గించడంపై చర్చించారు.
News March 5, 2026
నిజామాబాద్: ముగ్గురికి జైలు.. 26 మందికి భారీ జరిమానా!

నిజామాబాద్‌లో మద్యం తాగి వాహనాలు నడిపిన 29 మందికి కోర్టు భారీ జరిమానా, జైలు శిక్ష విధించింది. తనిఖీల్లో పట్టుబడిన వారిని ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. వారిలో 26 మందికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.2.60 లక్షల జరిమానా విధించారు. పులాంగ్‌కు చెందిన యాదగిరి, గూపన్‌పల్లికి చెందిన రాజేశ్వర్, ఒడ్డట్‌పల్లికి చెందిన నవీన్ కుమార్‌లకు వారం రోజుల జైలు శిక్ష పడింది.
News March 5, 2026
NZB: ఈ మండలాలకు రిపోర్టర్లు కావలెను

ఆర్మూర్, ఆలూరు, నందిపేట, డొంకేశ్వర్, మాక్లూర్, జక్రాన్‌పల్లి, ముప్కాల్, మెండోరా, మోర్తాడ్, ఇందల్వాయి, డిచ్‌పల్లి, రెంజల్, కోటగిరి మండలాలకు Way2Newsలో పని చేసేందుకు అనుభవం కలిగిన రిపోర్టర్లు కావలెను. ఆసక్తి గల వారు <


