News August 2, 2024

మరో ఆరుగురి మెడికల్ సర్టిఫికెట్లపై అనుమానాలు

image

పూజా ఖేడ్కర్ వివాదం నేపథ్యంలో సివిల్ సర్వెంట్ల వైకల్య ధ్రువీకరణ పత్రాలపై కేంద్రం దృష్టి పెట్టింది. ఆరుగురి మెడికల్ సర్టిఫికెట్లను డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ పరిశీలిస్తోంది. వీరిలో ఐదుగురు IASలు, ఒక IRS ఉన్నట్లు తెలుస్తోంది. కాగా తప్పుడు మెడికల్ సర్టిఫికెట్లు సమర్పించిన పూజా ఖేడ్కర్ అభ్యర్థిత్వాన్ని UPSC ఇప్పటికే రద్దు చేసింది. ఆమె దుబాయ్ పారిపోయినట్లు సమాచారం.

Similar News

News July 6, 2025

ప్రేమజంట ఆత్మహత్య!

image

AP: ప్రకాశం (D) కొమరోలు(M) అక్కపల్లెలో విషాదం నెలకొంది. పెద్దలు తమ వివాహానికి నిరాకరించడంతో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఇవాళ తెల్లవారుజామున యువతి, యువకుడు మృతదేహాలుగా చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. మృతులు నంద్యాల(D) ప్యాపిలి(M) మాధవరం వాసులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

News July 6, 2025

జులై 13 నుంచి వెబ్ ఆప్షన్లు

image

AP: EAPCET, ఫార్మసీ కాలేజీల వెబ్ ఆప్షన్ల నమోదును ఈ నెల 13 నుంచి నిర్వహించనున్నారు. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 10 నుంచి జరగాల్సి ఉండగా, 13వ తేదీకి మార్చారు. ఇంజినీరింగ్ కాలేజీలకు యూనివర్సిటీల అనుబంధ గుర్తింపు, ప్రభుత్వ అనుమతులు రావడానికి ఆలస్యం కారణంగానే వెబ్ ఆప్షన్ల నమోదు షెడ్యూల్‌లో అధికారులు మార్పులు చేశారు.

News July 6, 2025

NFDBని అమరావతికి తరలించండి: చంద్రబాబు

image

AP: HYDలో ఉన్న జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు(NFDB)ను అమరావతికి తరలించాలని CM చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. ‘గతంలో దేశ మత్స్య రంగంలో AP పాత్ర గుర్తించి ఈ బోర్డును HYDలో ఏర్పాటు చేశారు. రాష్ట్రం విడిపోయినా ఆక్వా ఉత్పత్తుల్లో APదే కీలక వాటా. రూ.19,420 కోట్ల ఎగుమతులతో దేశానికి నాయకత్వం వహిస్తోంది. సుదీర్ఘ తీరం, రొయ్యల పరిశ్రమ ఉన్న APలో దీని ఏర్పాటుకు అనుకూల పరిస్థితులున్నాయి’ అని వివరించారు.