News August 2, 2024

ప్రకాశం: MRO, VROను సస్పెండ్ చేసిన కలెక్టర్

image

సీఎస్‌పురం పర్యటన సమయంలో జాయింట్ కలెక్టర్‌కు వచ్చిన ఫిర్యాదుల మేరకు విచారణ నిర్వహించి MRO నాగుల్ మీరా, VRO శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. భూముల మ్యుటేషన్లకు సంబంధించి ఓ రైతు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కనిగిరి ఆర్డీవో ద్వారా విచారణ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఆ నివేదిక మేరకు MRO, VROను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.

Similar News

News September 19, 2025

IT కోర్ సెంటర్ కంట్రోల్ రూమ్‌ను సందర్శించిన SP

image

జిల్లా పోలీస్ కార్యాలయంలో SP హర్షవర్ధన్ రాజు గురువారం IT కోర్ సెంటర్, కంట్రోల్ రూమ్ సెంటర్లను సందర్శించారు. సిబ్బంది పని తీరు, విధులపై ఆరా తీశారు. CCTNS, CDR, సైబర్ క్రైమ్ అప్డేట్స్, అప్లికేషన్లపై సిబ్బందితో చర్చించారు. పలు ఫైల్స్ పరిశీలించారు. పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల దర్యాప్తునకు ఉపయోగపడే ఆధారాలను త్వరితగతిన అందించాలన్నారు.

News September 18, 2025

శాంతి భద్రతలకు విఘాతం కలిగితే కఠిన చర్యలు: SP

image

జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సిబ్బంది చర్యలు తీసుకోవాలని SP హర్షవర్ధన్‌రాజు సూచించారు. గురువారం పోలీసు కార్యాలయంలోని గెలాక్సీ భవనంలో అదనపు SPలు, DSPలు, CI, SIలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మాదకద్రవ్యాల నిర్మూలన, రోడ్డు ప్రమాదాల నివారణపై పలు సూచనలు చేశారు. కేసుల పరిష్కారంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

News September 18, 2025

ప్రకాశం ఎస్పీ గారూ.. ప్లీజ్ ఈవ్ టీజింగ్‌పై లుక్కేయండి!

image

ప్రకాశం జిల్లా నూతన SP హర్షవర్ధన్ రాజు ఇటీవల బాధ్యతలు చేపట్టారు. తిరుపతిలో SPగా ఉన్నప్పుడు ఈవ్ టీజింగ్‌పై ఉక్కుపాదం మోపారు. ఇప్పుడు ప్రకాశంలో కూడా అదే తీరు చూపాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. స్కూల్స్, కళాశాలలు మొదలు, ముగిసే సమయాల్లో పోకిరీల ఆగడాలు పెరిగాయని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. SP చొరవ తీసుకోవాలని వారు కోరారు.