News August 2, 2024
దాదాపు 400 చైనా కంపెనీలపై కేంద్రం ఉక్కుపాదం!

దేశంలోని దాదాపు 400కుపైగా చైనా కంపెనీల (లోన్ యాప్స్, ఆన్‌లైన్ జాబ్ పోర్టల్స్ etc) గుర్తింపును కేంద్రం రద్దు చేయనున్నట్లు సమాచారం. ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 700 చైనా కంపెనీలపై దర్యాప్తు చేపడుతోందని అధికార వర్గాలు తెలిపాయి. 300-400 సంస్థలను రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ నుంచి కేంద్రం తొలగించనుందని తెలుస్తోంది. ఏపీ, కర్ణాటక, ఢిల్లీ సహా 17 రాష్ట్రాల్లో ఈ కంపెనీలు ఉన్నాయి.
Similar News
News January 23, 2026
₹లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు: భట్టి

TG: మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాబోయే ఐదేళ్లలో మహిళా సంఘాలకు రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలను అందజేస్తామని తెలిపారు. ‘ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడమే కాదు. ప్రతివారం బిల్లులు ఇస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులు ఆలస్యం చేయకుండా ఇళ్లు నిర్మించుకోవాలి. బిల్లు చెల్లించే బాధ్యత మాది’ అని ఆసిఫాబాద్ జిల్లా జంగాంలో చెప్పారు.
News January 23, 2026
రిపబ్లిక్ డే పరేడ్‌లో AP, TG శకటాలకు నో ఛాన్స్

ఢిల్లీలో నిర్వహిస్తున్న రిపబ్లిక్ డే పరేడ్‌లో ఈసారి 30 శకటాలను ప్రదర్శించనున్నారు. 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, 13 కేంద్ర శాఖల శకటాలు ఇందులో ఉంటాయి. ఈ పరేడ్‌లో AP, TGకు చెందిన శకటాలకు అవకాశం దక్కలేదు. అందుకు సెలక్షన్ మాత్రమే కాకుండా.. డిఫెన్స్ మినిస్ట్రీ తీసుకొచ్చిన రొటేషన్ పాలసీ కూడా కారణం. 2024, 2025, 2026లో అన్ని రాష్ట్రాలు, UTలకు ఒక్క అవకాశమైనా వచ్చేలా చేస్తామని అందులో పేర్కొన్నారు.
News January 23, 2026
RCBని కొనేందుకు బిడ్ వేస్తా: అదర్ పూనావాలా

IPL ఫ్రాంచైజీ RCBని అమ్మేందుకు కొన్నాళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే. టీమ్‌ను కొనేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ జాబితాలో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా CEO అదర్ పూనావాలా కూడా ఉన్నారు. ఆయన ఆసక్తిగా ఉన్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. ‘IPLలో అత్యుత్తమ జట్లలో ఒకటైన RCB ఫ్రాంచైజీని కొనేందుకు రానున్న నెలల్లో బలమైన, పోటీతో కూడిన బిడ్ వేస్తా’ అని పూనావాలా ట్వీట్ చేశారు.


