News August 2, 2024
ఇది అసెంబ్లీ చరిత్రలో చీకటి రోజు: KTR
TG: అసెంబ్లీలో ఖైరతాబాద్ కాంగ్రెస్ MLA దానం నాగేందర్ మాట్లాడిన <<13762351>>బూతులను<<>> BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తప్పుబట్టారు. ఇది అసెంబ్లీ చరిత్రలో చీకటి రోజుగా అభివర్ణించారు. ‘మమ్మల్ని ‘అమ్మ.. అక్క’ అని తిడుతుంటే CM రేవంత్ పైశాచికానందం పొందుతున్నారు. అందర్నీ ఉసిగొల్పుతున్నారు. ఆయన చీఫ్ మినిస్టర్ కాదు. చీప్ మినిస్టర్. యువత రేవంత్‌కు తగిన సమాధానం చెప్పే టైమ్ త్వరలోనే వస్తుంది’ అని KTR వ్యాఖ్యానించారు.
Similar News
News February 3, 2025
సినిమాల్లోకి మోనాలిసా.. కొత్త PHOTO
కుంభమేళాలో ఆకర్షించే కళ్లతో పూసలు అమ్ముతూ రాత్రికి రాత్రే సెన్సేషన్‌గా మారిన మోనాలిసా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో పుష్ప-2 మూవీ పోస్టర్ ముందు ఆమె దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఇప్పుడు పోస్టర్ బయట. రేపు పోస్టర్ లోపల. కాలచక్రం అంటే ఇదే. త్వరలోనే ముంబైలో కలుద్దాం’ అంటూ ఆమె Xలో చెప్పుకొచ్చింది. కాగా <<15310417>>‘ది డైరీ ఆఫ్ మణిపుర్’<<>> చిత్రంలో మోనాలిసా నటించనుంది.
News February 3, 2025
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
గత వారం లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 620 పాయింట్ల నష్టంతో 76,895 వద్ద, నిఫ్టీ 211 పాయింట్లు నష్టపోయి 23,260 వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 87.16గా ఉంది.
News February 3, 2025
శక్తిమంతమైన టూల్‌ను తీసుకొచ్చిన ఓపెన్ ఏఐ
ఆన్‌లైన్‌లో రీసెర్చ్ చేయగల డీప్ రీసెర్చ్ అనే శక్తిమంతమైన టూల్‌ను ఓపెన్ ఏఐ తీసుకొచ్చింది. అత్యంత కష్టమైన పరిశోధనను కూడా ఈ టూల్ సమర్థంగా పూర్తి చేస్తుందని ఓపెన్ ఏఐ తెలిపింది. ‘మనిషి గంటల తరబడి చేసే పనిని డీప్ రీసెర్చ్ కేవలం నిమిషాల వ్యవధిలో చేయగలదు. ఒక ప్రాంప్ట్ ఇస్తే చాలు. నెట్టింట సమాచారాన్ని క్రోడీకరించి, విశ్లేషించి నివేదికను రిసెర్చ్ అనలిస్ట్ స్థాయిలో తయారుచేసి మీకు అందిస్తుంది’ అని పేర్కొంది.