News August 2, 2024
మాజీ సీఎంతో ఉమ్మడి విశాఖ నేతలు భేటి

మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మర్యాద పూర్వకంగా కలిశారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్‌ఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, పాడేరు మాజీ ఎమ్మెల్యే కే.భాగ్యలక్ష్మిలతో కలిసి జగన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చోడవరం నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులను వివరించారు.విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికపై చర్చించారు.
Similar News
News March 3, 2026
విశాఖలో మందగించిన రిజిస్ట్రేషన్లు

ఫిబ్రవరి 1 నుంచి భూముల విలువలు పెరుగుతాయని ప్రచారం జరిగినా ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేయడంతో విశాఖలో రిజిస్ట్రేషన్లు మందగించాయి. జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో క్షీణత కనిపించింది. 9 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఫిబ్రవరిలో సుమారు రూ.98 కోట్ల ఆదాయం లభించింది. అర్బన్‌లో అపార్ట్మెంట్లు అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేవు. 2025-26కి రూ.1400 కోట్ల లక్ష్యంలో ఫిబ్రవరి నాటికి రూ.952 కోట్లు వసూలయ్యాయి.
News March 3, 2026
రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం: ఎమ్మెల్యే పంచకర్ల

పెందుర్తి నియోజకవర్గంలోని 10 వార్డుల్లో ఎనిమిది నెలల్లో రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు తెలిపారు. మంగళవారం 77వ వార్డులో మేయర్ పీలా శ్రీనివాసరావుతో కలిసి రూ.7.5 కోట్ల విలువైన సిసి రోడ్లు, కాలువ పనులకు శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని, విలీన గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని ఆయన పేర్కొన్నారు.
News March 3, 2026
విశాఖ: బీచ్‌లో యువకుడి అనుమానాస్పద మృతి

ఆర్కేబీచ్‌లోని సుప్రీం హోటల్ ఎదురుగా అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతదేహం లభ్యమైంది. స్థానికులు గమనించి త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడు జగదాంబ సమీపంలో నివాసం ఉండే ఎం.శ్రీధర్ (36)గా పోలీసులు గుర్తించారు. శ్రీధర్ కార్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి బీచ్‌లో రాళ్ల మధ్య విగతజీవిగా పడి ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.


