News August 2, 2024

సముద్రంలో మునుగుతున్న యువకుడిని కాపాడారు

image

బాపట్ల మండల పరిధిలోని సూర్యలంక సముద్రతీరంలో అలల తాకిడికి మునిగిపోతున్న ఓ యువకుడిని గజఈతగాళ్లు, మెరైన్ పోలీసులు కాపాడారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. బాపట్లకు చెందిన అచ్యుత మహేశ్ అనే యువకుడు శుక్రవారం సూర్యలంక సముద్ర తీరానికి వచ్చాడు. సముద్రంలో స్నానం చేస్తుండగా అలలు రావడంతో యువకుడు మునిగిపోతుండగా, మెరైన్ పోలీసులు, గజఈతగాళ్లు గమనించి కాపాడారు.

Similar News

News March 11, 2026

ప్రకాశం జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగాలు.!

image

ప్రకాశం జిల్లా డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ పరిధిలోని ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ, ఫైనల్ మెరిట్ జాబితా‌ను మంగళవారం జిల్లా కో-ఆర్డినేటర్ విడుదల చేశారు. ఈ మేరకు ఆడియో మెట్రిటీషియన్, థియేటర్ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, పోస్టుమార్టం అసిస్టెంట్ తదితర పోస్టుల తుది జాబితాను (prakasam.ap.gov.in)వెబ్ సైట్‌లో పొందుపరిచినట్లు తెలిపారు. అభ్యర్థులు గమనించాలని కోరారు.

News March 11, 2026

ప్రకాశం: ఆసుపత్రులలో జాబ్స్.. తుది జాబితా విడుదల..!

image

ప్రకాశం జిల్లా డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ పరిధిలోని ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి స్వీకరించిన దరఖాస్తుల ఫైనల్ మెరిట్ జాబితా‌ను మంగళవారం జిల్లా కో ఆర్డినేటర్ విడుదల చేశారు. ఈ మేరకు ఆడియో మెట్రిటీషియన్, థియేటర్ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, పోస్టుమార్టం అసిస్టెంట్,తదితర పోస్టుల తుది జాబితాను (prakasam.ap.gov.in)వెబ్ సైట్‌లో పొందుపరిచినట్లు తెలిపారు. అభ్యర్థులు గమనించాలని కోరారు.

News March 10, 2026

కొండేపి: పదో తరగతి విద్యార్థుల్లో ధైర్యం నింపిన మంత్రి

image

పదో తరగతి పరీక్షల నేపథ్యంలో మంత్రి స్వామి మంగళవారం విద్యార్థులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన తన పదో తరగతి పరీక్షల అనుభవాలను పంచుకుంటూ విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు ఎటువంటి ఆందోళన చెందకుండా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరుకావాలని సూచించారు. ఒత్తిడిని జయించి ప్రశాంతంగా రాయాలని పలు కీలక సూచనలు చేశారు.