News August 2, 2024

నా కళ్లు చెమ్మగిల్లాయి: ఎమ్మెల్యే RRR

image

ఉండి నియోజకవర్గంలో మొదటి రోజే 99శాతం ఫించన్ల పంపిణీ చేశామని MLA రఘురామకృష్ణరాజు (RRR) అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సూపర్ సిక్స్‌ పథకాల అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కట్టుబడి ఉన్నారని, అందుకోసం ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. పెంచిన ఫించన్ రూ.4,000 అందుకున్న లబ్ధిదారుల కళ్లలో ఆనందం చూసి తన కళ్లు చెమ్మగిల్లాయని ఆయన అన్నారు.

Similar News

News February 7, 2026

ఉండి: కాలువలో కుళ్లిన మృతదేహం

image

ఉండి మండలం చెరుకువాడ పంట కాలువలో శనివారం ఒక వృద్ధుడి మృతదేహం లభ్యమైంది. మృతుడి వయసు సుమారు 65 ఏళ్లు ఉండవచ్చని, శరీరంపై కేవలం నీలిరంగు లుంగీ మాత్రమే ఉందని పోలీసులు తెలిపారు. మృతదేహం కుళ్లిపోయి గుర్తుపట్టలేని విధంగా ఉందని ఉండి SI నసీరుల్లా పేర్కొన్నారు. శవాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News February 6, 2026

రేపు రైస్ మిల్లర్లకు ఎంఎస్‌ఎంఈపై అవగాహన: కలెక్టర్

image

పెదమిరంలోని నిర్మల ఫంక్షన్ హాల్‌లో శనివారం ఈనెల 7 ఎంఎస్‌ఎంఈ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో రైస్ మిల్లుల యజమానులు, పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, యువ నిపుణులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

News February 6, 2026

ఏకీకృత కుటుంబ సర్వే ప్రక్రియకు సహకరించాలని: జేసీ

image

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరాలంటే ప్రజల పూర్తిస్థాయిలో ఏకీకృత కుటుంబ సర్వే ప్రక్రియకు సహకరించాలని జేసీ రాహుల్ కుమార్ రెడ్డి కోరారు. శుక్రవారం భీమవరం 21వ వార్డు పెద్ద పేట కుసుమ ప్రియ అపార్ట్మెంట్ వద్ద నిర్వహిస్తున్న ఏకీకృత కుటుంబ సర్వే ప్రక్రియలో జేసీ స్వయంగా పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి నేరుగా ప్రజలతో మాట్లాడారు. సర్వేను త్వరితగతం పూర్తి చేయాలన్నారు.