News August 2, 2024
నాగ్‌పూర్ వెళ్లి పింఛన్ అందజేసిన ఉద్యోగి

ఒకటో తేదీనే పింఛన్ అందజేయాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు, సిబ్బంది వారి విధుల్లో నిబద్ధత చాటుకుంటున్నారు. తొలి రోజు అందని వారికి కనీసం రెండో రోజైనా అందేలా చూస్తున్నారు. సంతమాగులూరు మండలం ఏల్చూరుకు చెందిన 20మంది లబ్ధిదారులు మహారాష్ట్రలోని నాగపూర్ వెళ్లారు. ఈ నేపథ్యంలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గౌస్ ఈరోజు నాగ్‌పూర్ వెళ్లి మరీ వారికి పింఛన్ అందజేశారు. దీంతో గౌస్‌ను పలువురు అభినందించారు.
Similar News
News March 10, 2026
కొండేపి: పదో తరగతి విద్యార్థుల్లో ధైర్యం నింపిన మంత్రి

పదో తరగతి పరీక్షల నేపథ్యంలో మంత్రి స్వామి మంగళవారం విద్యార్థులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన తన పదో తరగతి పరీక్షల అనుభవాలను పంచుకుంటూ విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు ఎటువంటి ఆందోళన చెందకుండా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరుకావాలని సూచించారు. ఒత్తిడిని జయించి ప్రశాంతంగా రాయాలని పలు కీలక సూచనలు చేశారు.
News March 10, 2026
మార్కాపురం మున్సిపాలిటీలో ఉద్యోగాల పేరిట రూ.కోటి టోకరా..?

మార్కాపురం మున్సిపాలిటీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఓ వ్యక్తి నమ్మబలికి రూ.కోటికి పైగా వసూలు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పారిశుద్ధ్య కార్మికులుగా చేర్పించడానికి ఒక్కొక్కరి వద్ద రూ.2 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలిసింది. గత ఏడాదిగా నియమకాలు లేకుండానే పనులు చేయించుకుంటున్నట్లు తెలిసింది. 15 నెలలు అవుతున్నా ఉద్యోగం రాకపోవడంతో తమ డబ్బులు వెనకకు ఇవ్వాలని బాధితులు అడగడంతో ఈ వ్యవహారం బయటపడింది.
News March 10, 2026
ప్రకాశం జిల్లాలో మిస్సింగ్ కేసులపై దృష్టి

మిస్సింగ్ కేసులు, NBW, మహిళలకు సంబంధించిన కేసులు, రోడ్డు ప్రమాదాల నివారణ, అలాగే స్వర్ణాంధ్ర విజన్‌కి పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ వంటి అంశాలపై సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో SP హర్షవర్ధన్ రాజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై అధికారులను అరా తీశారు. మిస్సింగ్ కేసుల ఛేదనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, చిన్నారులు, మహిళల అదృశ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.


